SUSPENSION OF SRIVARI DARSHAN TO PILGRIMS EXTENDED TILL APRIL 14 _ ఏప్రిల్ 14 వరకు శ్రీవారి ఆల‌యంలో భ‌క్తుల‌కు దర్శనం నిలుపుద‌ల పొడిగింపు

Tirumala, 30 March 2020: In view of the government decision of lockdown to contain the spread of Corona Covid 19 virus till April 14, the TTD has decided to continue the suspension of the Srivari darshan at Srivari temple for pilgrims till that date.

It may be recalled that over the instructions of Government, TTD had imposed total suspension of Srivari darshan for pilgrims in Tirumala temple till March 31.

As a result of the latest decision the festivals of Sri Ramanavami Asthanam on April 2 and the Sri Rama Pattabhiseka Asthanam on April 3 will be performed inside the temple in Ekantam while Hanumantha Vahana Seva on the occasion of Sri Rama Navami remains cancelled.

Similarly the three-day annual vasantotsavam from April 5-7 will be conducted at the Kalyana Mandapam inside the Srivari temple in Ekantam and the procession of Swarna Ratham on April 6 is also cancelled.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 14 వరకు శ్రీవారి ఆల‌యంలో భ‌క్తుల‌కు దర్శనం నిలుపుద‌ల పొడిగింపు

తిరుమల, 2020 మార్చి 30: క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యం కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు దర్శనం నిలుపుద‌ల నిర్ణయాన్ని ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు పొడిగించడమైనది. గతంలో మార్చి 31వ తేదీ వరకు శ్రీవారి దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు టిటిడి ప్రకటించిన విషయం విదితమే.

అదేవిధంగా, ఏప్రిల్ 2న‌ శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే హనుమంత వాహన సేవను రద్దు చేసి శ్రీరామనవమి ఆస్థానాన్ని, ఏప్రిల్ 3న శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఏప్రిల్ 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు మూడు రోజులపాటు జ‌రుగ‌నున్న వార్షిక వసంతోత్సవాలను శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో ఏకాంతంగా జ‌రుపుతారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.