PAVITRA SAMARPANA HELD _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

Srinivasa Mangapuram, 12 Nov. 20: On the second day of the three day annual Pavitrotsavams at Srinivasa Mangapuram temple, Pavitamala Samarpana was held on Thursday.

TTD EO Dr KS Jawahar Reddy who took part in this fete speaking on the occasion said, Pavitrotsavams are usually performed to ward off the sins committed by the religious staff either knowingly or unknowingly all through the year while performing festivities. This festival will conclude with Purnahuti on Friday, he maintained.

Temple DyEO Smt Shanti, AEO Sri Dhananjeyulu were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
 
తిరుపతి, 2020 నవంబరు 12: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాల్లో రెండో రోజైన గురు‌వారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేప‌ట్టారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ ఏడాది పొడ‌వునా స్వామివారి ఉత్స‌వాలు, సేవ‌ల్లో జ‌రిగిన చిన్న చిన్న దోషాలను నివారించి పూర్తి ఫలాన్ని మాన‌వాళికి అందించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంద‌న్నారు. శుక్ర‌వారం పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగుస్తాయ‌న్నారు. ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హించిన అర్చ‌క బృందానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.
 
ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాల అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ త‌రువాత ఆల‌యంలోని మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేప‌ట్టారు.
     
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి విఆర్‌.శాంతి, ఏఈఓ ధనుంజయులు, సూప‌రింటెండెంట్ శ్రీ రమణయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.