SRI GT BTU BEGINS WITH DWAJAROHANAM _ శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ధ్వజారోహణం

Tirupati, 28 May 20: The annual Brahmotsavams of Sri Govindarajaswamy temple kicked off on Thursday morning with the Dhwajarohanam in the auspicious Mithuna Lagnam 8am and 9:30am.

Archakas and Veda pundits installed the flag with the Garuda image on the temple pillar amidst chanting of Veda mantras and Mangala vaidyams and later Srivari Asthanam was performed within the complex sans devotees in view of Coronavirus restrictions.

Apart from a variety of rituals TTD also organised, Snapana Tirumanjanam in the afternoon. In the evening, Pedda Sesha Vahanam was performed within the temple corridors.

Sri Sri Sri Pedda Jeeyar Swami, Sri Sri Sri Chinna Jeeyar Swami, Special Grade Dyeo Smt Varalakshmi and temple staffs were present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI    

ధ్వజారోహణంతో ప్రారంభ‌మైన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు 
 
తిరుపతి, 2020 మే 28: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8.00 నుండి 9.30 గంటల మద్య మిథున లగ్నంలో ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఆనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది.
 
అంత‌కుముందు అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీభూ సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.
 
స్నపన తిరుమంజనం –
 
ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంల‌తో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. 
 
పెద్దశేష వాహనం – 
 
క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉద‌యం, రాత్రి మాడ వీధుల్లో  వాహ‌న‌సేవ‌ల ఊరేగింపును ర‌ద్దు చేశారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 5.00 గంట‌ల‌కు పెద్దశేష వాహన‌ సేవ‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌‌, ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ భ‌ట్టార్ ఏ.పి.శ్రీ‌నివాస‌దీక్షితులు టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కృష్ణ‌మూర్తి, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.