TWO SUCCESSFUL OPEN HEART SURGERIES AT SRI PADMAVATHI CHILDREN HOSPITAL _ శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిలో విజయవంతంగా మరో రెండు ఓపెన్ హార్ట్ సర్జరీలు- ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు

FREE AROGYASREE OPERATIONS

Tirupati, 24 Nov. 21: Sri Padmavati Children’s Super speciality Cardiac Hospital set up by TTD has set a stellar record with successful open-heart surgeries on two ailing children from Chittoor and Anantapur districts respectively.

According to the Director of the Hospital, Dr Srinath Reddy, among the two, the first patient was an 18-month-old boy, Harshith born with a heart ailment, hailing from Lakshmipuram of Kuppam in Chittoor district.

His parents had brought the child to Tirupati on Friday last week after other hospitals diagnosed a costly operation costing to a lakh. As they could not afford the costly treatment, over the suggestion of their near, they brought him to Sri Padmavathi Cardiac hospital. Immediately after admission several tests were conducted and doctors diagnosed an operation to separate the mixed arteries carrying blood to heart. After a five hour procedure, the anomaly was set right and Harshith is now recovering in the ICU.

In a similar case, a 3-year-old Bala Chandra Nayak of MNP Thanda in Anantapur suffered from heart disorder. The doctors at Sri Padmavati children hospital acted swiftly after reports displayed a blockage and performed a five-hour procedure of Open Heart Surgery (intracardiac repair).

It may be mentioned here that very recently a girl from YSR Kadapa district, Kavita was also successfully operated and was registered as the first cardiac case to be dealt with.

Dr Srikanth says the hospital is geared to perform 100 surgeries in a month from January onwards.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిలో విజయవంతంగా మరో రెండు ఓపెన్ హార్ట్ సర్జరీలు
– ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు

తిరుపతి 24 నవంబరు 2021: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిలో మరో రెండు ఓపెన్ హార్ట్ సర్జరీలు విజయవంతంగా చేశారు.

చిత్తూరు జిల్లా కుప్పం లోని లక్ష్మీపురం కు చెందిన హర్షిత్ అనే 18 నెలల పిల్లాడు గుండె సంబంధిత సమస్యలతో పుట్టాడు. తల్లిదండ్రులు అనేక చోట్ల ఆసుపత్రుల్లో చూపించారు. పిల్లాడికి గుండె ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోలేని ఆ పిల్లాడి తల్లిదండ్రులు శుక్రవారం తిరుపతి లోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె చికిత్స ఆసుపత్రికి వచ్చారు. అతన్ని వెంటనే అడ్మిట్ చేసుకున్న వైద్యులు అవసరమైన పరీక్షలు చేసి రిపోర్టులు రావడంతో గుండె ఆపరేషన్ చేశారు. హర్షిత్ గుండె కు వెళ్ళే మంచి రక్తం, చెడు రక్తం కలసి పోతుండటంతో వైద్యులు ఐదు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి ఈ ఇబ్బందిని తొలగించారు. హర్షిత్ ప్రస్తుతం ఐసీయూలో వైద్య సేవలు పొందుతున్నాడు.

అలాగే అనంతపురం జిల్లా ఎం ఎన్ పి తండా కు చెందిన బాల చంద్ర నాయక్ అనే 3 సంవత్సరాల బాలుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చాడు. అతని తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే స్థోమత లేక శుక్రవారం శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. వైద్యులు ఈ అబ్బాయిని కూడా వెంటనే అడ్మిట్ చేసుకుని అవసరమైన పరీక్షలన్నీ చేసి రిపోర్ట్ లు అందిన అనంతరం నాలుగు నుంచి ఐదు గంటల పాటు శ్రమించి ఓపెన్ హార్ట్ ( ఇంట్రా కార్డియాక్ రిపేర్ )సర్జరీ చేశారు. బాల చంద్ర కూడా ప్రస్తుతం ఐసీయూలో వైద్య సేవలు పొందుతున్నాడు. వై ఎస్ ఆర్ జిల్లా కు చెందిన కవిత అనే బాలికకు ఇటీవలే వైద్యులు ఈ ఆసుపత్రిలో మొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

మరో రెండు మూడు రోజుల్లో వీరిద్దరినీ డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి తెలిపారు. జనవరి నుంచి నెలకు 100 సర్జరీలు చేసేవిధంగా వైద్యులు ఇతర సిబ్బంది బృందాన్ని తయారు చేసుకుంటున్నామని ఆయన చెప్పారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.