ANKURARPANAM PERFORMED _ శ్రీ వ‌రాహస్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ

TIRUMALA, 24 NOVEMBER 2021:  The ankurarpanam for the five day Astabandhanam and Balalaya Maha Samprokshanam at Sri Varaha Swamy temple in Tirumala on Wednesday.

As part of this fete, the procession of Sri Viswaksena took place from Tirumala temple to Vasantha mandapam and Mritsangrahanam was performed. Later Beejavapanam was performed in Varaha Swamy temple amidst chanting of Veda mantras. Earlier in the day, Samprokshanam was performed.

On November 25, Kalakarshana will be observed in Sri Varaha Swamy temple between 8pm and 10pm.

Addl EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Ramesh and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ వ‌రాహస్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ

 తిరుమల‌, 2021 నవంబరు 24: తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు విమాన జీర్ణోద్ధ‌ర‌ణ, అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ నేపథ్యంలో బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది.

ఇందులో భాగంగా రాత్రి శ్రీ విష్వ‌క్సేనుల వారిని శ్రీ‌వారి ఆల‌యం నుండి ఊరేగింపుగా వ‌సంత మండ‌పానికి వేంచేపు చేసి మృత్సంగ్ర‌హ‌ణం నిర్వ‌హించారు. అనంతరం శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యంలో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన‌ రాగి రేకులు అమర్చేందుకు 2020, డిసెంబరు 6 నుండి 10వ తేదీ వరకు బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేశారు. స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారు. విమాన గోపురం ప‌నులు పూర్తి కావ‌డంతో జీర్ణోద్ధ‌ర‌ణ, అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.