SRI RAMA JANANAM EPISODE RECREATED AT VASANTA MANDAPAM _ శ్రీ రామ‌నామ స్మ‌ర‌ణ‌తో పుల‌కించిన వ‌సంత మండ‌పం

TIRUMALA, 07 SEPTEMBER 2021: As part of the ongoing Sakala Karyasiddhi Balakanda Parayanam at Vasanta Mandapam in Tirumala, the important chapter of the Srimad Ramayana-the birth of Sri Ramachandramurthy was recited by Vedic pundits on Tuesday.

 

Under the supervision of Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani, scholars Sri Maruti, Sri Prava Ramakrishna Somayaji amidst brief narration recited the shlokas from 15 to 21 Sargas which also included the “Sri Rama Jananam”. To match the situation, the entire Vasanta Mandapam was decked beautifully. The image of Bala Sri Rama was placed on a swing with the life-size images of Sri Maha Vishnu and Sri Venkateswara Swamy on either sides.

 

On the other hand, the Vedic scholars performed special Havanam at Dharmagiri Veda Vignana Peetham in Tirumala. 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ రామ‌నామ స్మ‌ర‌ణ‌తో పుల‌కించిన వ‌సంత మండ‌పం

–  శ్రీ‌రామ జ‌న‌న స‌ర్గ‌ల పారాయ‌ణం

–  ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో శాస్త్రోక్తంగా జ‌ప‌-త‌ర్ప‌ణ‌-హోమాలు

తిరుమ‌ల‌, 2021 సెప్టెంబ‌రు 07: లోక సంక్షేమం కోసం, క‌రోనా మూడ‌వ వేవ్ నుండి చిన్నారులు అందరూ ఆరోగ్యంగా ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల వ‌సంత‌మండ‌పంలో సెప్టెంబ‌రు 3వ తేదీ నుండి టిటిడి నిర్వ‌హిస్తున్న”  షోడ‌శ‌దిన బాల‌కాండ పారాయ‌ణ‌ దీక్ష  ” కార్య‌క్ర‌మంలో భాగంగా 5వ రోజైన మంగ‌ళ‌వారం శ్రీరామ‌ జ‌న‌న స‌ర్గ‌ల పారాయ‌ణం జ‌రిగింది.

బాల‌కాండ‌లో ” బ‌భౌరామఃసంప్ర‌హృష్టఃస‌ర్వ‌దైవ‌తైః ”  అనే 16 అక్ష‌రాల వాక్యం విశిష్ట‌మైన‌ది. ఇందులో 5వ‌ రోజు  ” సం  ” అనే అక్ష‌రానికి ఉన్న బీజాక్ష‌రాల ప్ర‌కారం బాల‌కాండలోని 15వ స‌ర్గ నుండి 21వ స‌ర్గ వ‌ర‌కు ఉన్న 230 శ్లోకాల‌ను పారాయ‌ణం చేశారు. ఇందులో భాగంగా మొద‌ట సంక‌ల్పంతో ప్రారంభించి శ్రీ‌రామ ప్రార్థ‌న‌, శ్రీ ఆంజ‌నేయ ప్రార్థ‌న‌, శ్రీ వాల్మీకి ప్రార్థ‌న చేశారు. ఆ త‌రువాత 16 మంది ఉపాస‌కులు శ్లోక పారాయ‌ణం చేశారు. కాగా బాల‌కాండలోని మొత్తం 77 స‌ర్గ‌ల్లో 2,232 శ్లోకాలు ఉన్నాయి.

ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధాని ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాప‌కులు శ్రీ‌ రామ‌కృష్ణ సోమ‌యాజి శ‌ర్మ‌, శ్రీ పివిఎన్ఎన్‌ మారుతి పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌ల నుండి ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశారు.

ఆక‌ట్టుకున్న సెట్టింగులు :

శ్రీ‌రామ జ‌న‌న స‌ర్గ‌ల పారాయ‌ణం సంద‌ర్భంగా టిటిడి ఏర్పాటు చేసిన సెట్టింగులు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఊయ్య‌ల‌లో బాల శ్రీ రామ‌చంద్ర‌మూర్తి, ఇరువైపుల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు, శ్రీ మ‌హావిష్ణువుల‌ను ఏర్పాటు చేశారు.

రామ జ‌న‌న‌ కీర్త‌న‌తో పుల‌కించిన వ‌సంత మండ‌పం

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తెలుగు వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామివారు ర‌చించిన శ్రీ‌రామ జ‌న‌న‌ కీర్త‌న‌ను తిరుప‌తికి చెందిన ప్ర‌ముఖ‌ గాయ‌ని డా.ఆముక్తమ‌ల్యాద సుష‌ణ బృందం  ” రామ శ్రీ రామ లాలి ఊగుచు ఘన శ్యామా నేను బ్రోవు లాలి ……..” కీర్త‌న‌ను సుమ‌ధురంగా ఆల‌పించారు.  

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి, వేద పండితులు పాల్గొన్నారు.

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో :

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలోని ప్రార్థ‌నా మందిరంలో శ్రీ జిఎవి దీక్షితులు ఆధ్వ‌ర్యంలో బాల‌కాండ‌ పారాయ‌ణంలో భాగంగా ప్ర‌తి రోజు క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ‌కు విశేష మంత్రాల‌తో జ‌ప‌-త‌ర్ప‌ణ-హోమాదులు నిర్వ‌హిస్తున్నారు. లోక క్షేమం కోసం 16 రోజుల పాటు ఉపాస‌కులు అకుంఠిత‌ దీక్ష, శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీ సీతాల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామి స‌మేత శ్రీ రామ మూల మంత్రానుష్ఠానం జ‌పిస్తున్నారు. జ‌పంలో ప‌ద‌వ వంతు ఆవు పాల‌తో త‌ర్ప‌ణం, త‌ర్ప‌ణంలో 10వ వంతు హోమాలు జ‌రుగుతున్నాయి.

ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం ఉద‌యం 8.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతాల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామి స‌మేత శ్రీ రామచంద్ర‌మూర్తికి స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌తుష్టార్చ‌న‌, శాత్తుమొర‌, పూజ జ‌పం, హోమం నిర్వ‌హించారు. అదేవిధంగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు అంగ‌పూజ నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.