SVIMS, BIRRD AND PAEDIATRIC CARDIAC HOSPITALS ARE CENTRES OF HOPE FOR THE COUNTRY-NBE VICE PRESIDENT DR BAJPAYEE _ స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి హృదయాలయలో ప్రపంచస్థాయి ప్రమాణాలు- నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మిను బాజ్ పాయ్

LAUDS THE IMPECCABLE SERVICES OF TTD HOSPITALS

 

TIRUPATI, 27 APRIL 2023: The TTD-run super specialty hospital of SVIMS, BIRRD and SPCHC are the centres of hope for the country with their world-class standards of medical services, said Dr Minu Bajpayee, the Executive Director of National Board of Examinations in Medical Sciences(NBEMS).

 

Dr Bajpayee along with the TTD EO Sri AV Dharma Reddy and JEO for Health and Education Smt Sada Bhargavi visited the SPCHC and BIRRD hospitals in Tirupati on Thursday. 

 

Later speaking to the media persons at BIRRD he lauded the committed services of TTD in the area of patient care by establishing world-class hospitals with expert doctors who are rendering impeccable services to the needy. “This entire region is really fortunate to have such state of art hospitals with international standards. These hospitals are Centres of hope to the nation in the field of medicine”, he asserted.

 

Dr Bajpayee expressed immense happiness over the services of SPCHC for doing over 1300 heart operations to the children including Heart Transplantation.

He also complimented BIRRD for knee cap transplants and treatment of other Ortho ailments at the institute.

 

Briefing about the NBEMS activities he said the NBEMS aims at promoting fellowships in specialists, skill development and the union health ministry has provided 14 fellowships so far which will be granted in May besides providing training in Artificial Intelligence and Mission Learning.

 

He complimented both the Director of SPCHC Dr Srinath Reddy and his team and the OSD BIRRD, Dr Reddeppa Reddy and his team for carrying out the surgeries with finesse and expertise with commitment.

 

Earlier he went round the hospitals and interacted with parents.

 

TTD EE Sri Krishna Reddy, Dr Ganapathi, Dr Ramamurthy, Dr Pradeep, Dr Venugopal and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి హృదయాలయలో ప్రపంచస్థాయి ప్రమాణాలు

– కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ అంశాల్లో వైద్యులకు శిక్షణ

– నూతన వైద్య పరికరాలు తయారీ కోసం ల్యాబ్ ఏర్పాటు చేస్తాం

– నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మిను బాజ్ పాయ్

తిరుపతి, 2023 ఏప్రిల్ 27: తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి హృదయాలయ ఆసుపత్రుల్లో ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలు పాటిస్తున్నారని ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్, నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మిను బాజ్ పాయ్ ప్రశంసించారు. గురువారం ఆయన టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డితో కలిసి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, బర్డ్ ఆసుపత్రులను సందర్శించారు.

ఎస్పీసీహెచ్‌సీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు వార్డుల్లో వున్న చిన్నారులు, గుండె జబ్బులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారులను, క్యాథ్‌ల్యాబ్, ఐసీయూ తదితర కేంద్రాలను డాక్టర్ బాజ్ పాయ్ సందర్శించి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు.

అనంతరం బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి మరియు ఆర్థో సంబంధిత వ్యాధులకు అందిస్తున్న చికిత్సలను డాక్టర్ బాజ్ పాయ్ కు వివరించారు.

ఆ తరువాత డాక్టర్ బాజ్ పాయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ టీటీడీ ఆసుపత్రులలో నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, మోకీలు, తుంటి మార్పిడి, అత్యంత సంక్లిష్టమైన వెన్నుపూస ఆపరేషన్లు, గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, బర్డ్ ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలు, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారన్నారు. పద్మావతి ఆసుపత్రిలో ఇప్పటి వరకు 1300 గుండె సంబంధిత ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. దేశం నలుమూలలతో పాటు పక్క దేశం నుంచి కూడా చిన్నపిల్లల తల్లిదండ్రులు ఇక్కడికి చికిత్స కోసం వస్తుండడం గొప్ప విషయమన్నారు.

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద వైద్యరంగంలో అమలవుతున్న కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తామని తెలిపారు. తమ బోర్డు ఆధ్వర్యంలో స్పెషలిస్టులను తయారు చేయడం జరుగుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ, అర్హులైన వారికి ఫెలోషిప్ లు అందిస్తున్నామని వివరించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్ సుక్ మాండవీయ గతేడాది 14 ఫెలోషిప్ లు అందించారని, ఈ ఏడాది మే నెలలో మరికొన్ని ఫెలోషిప్పులను అందిస్తారని తెలియజేశారు. కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ అంశాల్లో వైద్యులకు శిక్షణ ఇస్తామన్నారు. క్యాన్సర్ రోగుల కోసం వినియోగించే లీనియర్ యాక్సిలరేటర్ రూ.50 కోట్ల వ్యయం అవుతుందని, మన దేశంలో ఇలాంటివి కొన్ని వందల సంఖ్యలో కావాల్సి ఉందన్నారు. ఇలాంటి ఖరీదైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేసేందుకు మన డాక్టర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బర్డ్ ఆసుపత్రిలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సౌకర్యాలు ఉన్నాయని తెలియజేశారు. వైద్య రంగంలో నూతన పరికరాల తయారీ కోసం బర్డ్ లో ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం దేశంలోని 5 ప్రముఖ ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవిని ఆయన అభినందించారు.

ఈఈ శ్రీ కృష్ణారెడ్డి, ఎస్పీసీహెచ్‌సీకి చెందిన డాక్టర్ గణపతి, బర్డ్ వైద్యులు డాక్టర్ రామూర్తి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.