KOIL ALWAR TIRUMANJANAM HELD _ శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 08 September 2026: The annual Koil Alwar Tirumanjanam (sacred temple cleansing fete) was performed at Sri Venkateswara Temple on Tuesday in view of Srivari Brahmotsavams from September 15–23.

TTD Chairman B.R. Naidu, Additional EO Ch. Venkaiah Chowdary, priests, and officials participated in the ritual, which is traditionally held on the Tuesday before major festivals.  

The Additional EO said the traditional purificatory ritual covered the entire temple complex—from Ananda Nilayam to Bangaru Vakili—including shrines, courtyards, walls, rooftops, and worship materials.

From 6 am to 10 am, priests performed the ceremony as per Agama shastras, covering the main deity with a cloth. Afterward, a sacred mixture Parimalam was sprinkled throughout the temple. 

Special pujas and naivedyam followed before devotees were allowed for darshan.

TTD confirmed all Brahmotsavam arrangements are complete. Astadala Pada Padmaradhana Seva were suspended on September 8 due to the ritual.

Several Board members, CVSO Muralikrishna, Deputy EO Bhaskar, and other officials were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2026 సెప్టెంబర్ 08: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయని, ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లన్ని పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆగమానుసారంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.

కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో భాస్కర్, తదితర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.