టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 సెప్టెంబర్ 08: టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ దర్శన్ సతీమణీ శ్రీమతి యశోద దర్శన్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

