ANKURARPANA: SOWING PROSPERITY – REAPING DIVINE PROTECTION _ అంకురార్పణతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఘట్టాలకు బీజం
Tirumala, 13 September 2026: Ankurarpana, the festival of prelude for the nine day mega religious festival of annual Brahmotsavams at Tirumala observed ceremonially between 7pm and 8pm on Monday, September 14 in Tirumala.
Significance : As per Vaikhanasa Agama, the Ankurarpana is a sacred seed-sowing ceremony conducted in the Yagasala wherein nine types of cereals (Nava Dhanyalu) are sown in earthen pots called Palikas.
Vaikhanasa Agama also describes Ankurarpanam as ”Beejavapanam”, conducted seeking the divine intervention for the well being of the humanity.
Sprouted blessings :
The growth of the sprouts is regarded as an auspicious indication of the smooth and successful conduct of the festival.
• Seeds represent life, fertility, growth, and abundance.
• Their sprouting symbolically invokes the flourishing of the festival and the welfare of devotees.
Germination in Moon Light:
• Ankurarpanam is generally performed at night because the Moon (Chandra) is regarded in the tradition as the Sasyakaraka, or significator and controller of vegetation.[1]
The Shastras prescribe that Ankurarpanam should ideally be performed *nine days before* the main festival.
Depending on circumstances, it may also be conducted seven, five, three, or at least one day before the utsavam.
The nine grains sown during Ankurarpanam are not mere crops—they represent the nine celestial planets (Nava Grahas).
Wheat represents Sun, Rice – Moon, Red gram- Mars, Green gram-Mercury, Chickpeas – Jupiter, Cowpeas – Venus, Sesame – Saturn, Black gram-Rahu, Horse gram-Ketu
Senadhipati Utsavam, Medini Puja, Mritsangrahanam rituals are also observed on the occasion.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
అంకురార్పణతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఘట్టాలకు బీజం
సెప్టెంబర్ 14న రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం
తిరుమల, 2026 సెప్టెంబరు 13: ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15వ తేదీ నుండి తిరుమలలో ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీ రాత్రి 7గంటల నుండి 8 గంటల మధ్యలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది.
ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.
సేనాధిపతి ఉత్సవం ….
శ్రీవారిసర్వసైన్యాధ్యక్షుడుశ్రీవిష్వక్సేనులవారిని ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.
మేదినిపూజ….
నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు.
అంకురార్పణ….
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో(మట్టికుండలు) పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇందులో గోధుమలు – సూర్యుడు, బియ్యం – చంద్రుడు, కందులు – కుజుడు, పెసలు – బుధుడు, శనగలు – బృహస్పతి, అలసందలు – శుక్రుడు, నువ్వులు – శని, మినుములు – రాహువు, ఉలవలు – కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.
అక్షతారోపణ…
ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా నడుస్తాయి అన్నది భక్తుల విశ్వాసం.


