NO RESTRICTIONS ON PRIVATE VEHICLES TO TIRUMALA – TTD _ తిరుమలకు ప్రైవేటు వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు
DEVOTEES NOT TO BELIEVE FALSE PROPAGANDA ON SOCIAL MEDIA
Tirumala, 13 September 2026: TTD has appealed to its devotees not to believe in fake propaganda making rounds on social media platforms over that restrictions are being imposed on private vehicles.
The reports said that only 15,000 vehicles would be permitted per day to Tirumala. Afterwards the vehicles would be halted at checkpoint itself.
TTD has clarified that these reports are completely false. No such decision has been taken regarding the number of private vehicles permitted to travel to Tirumala.
And appealed to devotees not to believe the misinformation being circulated on social media.
TTD also stated that important decisions and official information would be communicated only through the official TTD website and its channel.
It is inappropriate to create confusion among devotees by circulating unverified and false information and also warned that strict legal action would be taken against those spreading fake news and false information in the name of the TTD.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తిరుమలకు ప్రైవేటు వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు
సోషియల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
తిరుమల, 2026 సెప్టెంబర్ 13: తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజుకు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తరువాత వచ్చే వాహనాలను చెక్‌పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం టీటీడీ దృష్టికి వచ్చింది.
ఇది పూర్తిగా అవాస్తవం. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని టీటీడీ తీసుకోలేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, సమాచారం అధికారిక టీటీడీ ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి. వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఇలాంటి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా భక్తులను అయోమయానికి గురిచేయడం సరికాదు.
టీటీడీ పేరుతో తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడమైనది.
