Rs.3.78 LAKH WORTH DIAMOND JEWELLERY DONATED TO SRI PADMAVATHI AMMAVARI TEMPLE _ శ్రీ పద్మావతీ అమ్మవారికి రూ.3.78 లక్షల విలువైన వజ్రాభరణాల విరాళం

Tirupati, September 13, 2026: Bengaluru-based couple Smt. C. Padmaja and Sri K. Raghavendrar Rao donated a pair of diamond-studded earrings worth Rs.3.78 lakh to Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, on Saturday.

The earrings are adorned with uncut diamonds, rubies and emeralds. The donors offered the jewellery with devotion, seeking the blessings of Goddess Padmavathi Ammavaru.

TTD Archaka Sri Babu Swamy, Temple AEO Sri Devarajulu, AVSO Srihari Rao, Superintendent Sri Suresh, Temple Inspector Sri Chalapathi and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీ పద్మావతీ అమ్మవారికి రూ.3.78 లక్షల విలువైన వజ్రాభరణాల విరాళం

తిరుపతి, సెప్టెంబరు 13, 2026: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి రూ.3.78 లక్షల విలువైన అరుదైన వజ్రాభరణాలను బెంగళూరుకు చెందిన శ్రీమతి సి. పద్మజ, శ్రీ కె. రాఘవేంద్రరావు దంపతులు శనివారం ఆలయ అధికారులకు భక్తిశ్రద్ధలతో విరాళంగా అందజేశారు.

అన్‌కట్ వజ్రాలు, కెంపులు, పచ్చలతో అలంకరించిన ఒక జత స్టడ్స్‌ను అమ్మవారి సేవకు సమర్పించారు. అమ్మవారి అనుగ్రహం పొందాలనే భక్తిభావంతో ఈ ఆభరణాలను సమర్పించినట్లు దాతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్‌వో శ్రీహరి రావు, సూపరింటెండెంట్ శ్రీ సురేష్, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది