SIMHA VAHANA SEVA –  A DIVINE ROAR OF ENDLESS FAITH _ సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప

Tirumala, 17 September 2026: Simha Vahana Seva was observed with celestial grandeur in Tirumala on Thursday morning, the third day of the ongoing annual Salakatla Brahmotsavams.

Adorned in resplendent attire, the processional deity of Malayappa Swamy mounted on the majestic Simha Vahanam, proceeded along the four Mada streets encircling the temple, delighting thousands of devotees gathered for darshan all along the galleries of Mada streets.

Devotees thronged the temple complex to witness the divine spectacle, of the ferocious yet divine Simha Vahanam.

Both the senior and junior pontiffs of Tirumala, TTD board members and officials participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప

ధైర్యం, పరాక్రమం, తేజస్సుకు ప్రతీకగా సింహ వాహనసేవ

తిరుమల, 2026 సెప్టెంబరు 17: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సింహ వాహనంపై కొలువుదీరిన శ్రీ మలయప్పస్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ సింహ వాహనసేవ అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగింది.

సింహ వాహనంధైర్యసిద్ధికి ప్రతీక

దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగా శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనాన్ని అధిరోహిస్తారు. సింహం పరాక్రమం, ధైర్యం, తేజస్సు, ఆధిపత్యం, మహాశక్తికి ప్రతీకగా భావించబడుతుంది.

సింహరూప దర్శనం మనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను, విజయస్ఫూర్తిని మేల్కొలుపుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం. సోమరితనాన్ని వీడి కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగేందుకు సింహ వాహనసేవ స్ఫూర్తినిస్తుంది.

యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారి దివ్య దర్శనం భక్తులకు అభయం, ధైర్యం, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే మహోన్నత అనుభూతిని కలిగించింది.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ కే వి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.