HIGHLIGHTS OF GARUDA SEVA _ గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల
TIRUMALA, 19 SEPTEMBER 2026: Some of the highlights during Garuda Seva, held at Tirumala, on Saturday evening.
For the first time artistes from Singapore arrived and displayed the mythological characters from Sri Sita Rama Kalyanam in front of Vahana Seva.
Common devotees provided vahana darshan through a separate line from Tirumala Nambi
Fifteen types of Menu served to devotees that included 08 food items and 07 Beverages
Annaprasadam wing made preparations of production plan to 24lakh potions that includes Annaprasadam, Beverages and Snacks
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల
గరుడ వాహనంపై వైభవంగా శ్రీమలయప్పస్వామి –
కనులారా వీక్షించిన లక్షలాది భక్తులు
తిరుమల, 2026 సెప్టెంబరు 19: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ శనివారం రాత్రి తిరుమలలో భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. స్వర్ణ గరుడ వాహనంపై శ్రీమలయప్పస్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడ వాహనం రాగానే మార్మోగిన గోవింద నామం
సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన మండపం నుంచి స్వర్ణ గరుడ వాహనంపై స్వామివారు వెలుపలకు రాగానే నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. లక్షలాది భక్తులు స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించుకుంటూ “గోవిందా… గోవిందా…” అంటూ చేసిన నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి.
1.80 లక్షల మంది భక్తులకు గ్యాలరీల్లో ఏర్పాట్లు
నాలుగు మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన 190 గ్యాలరీల్లో సుమారు 1.80 లక్షల మంది భక్తులు వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం రాత్రి నుంచే అనేక గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి.
శనివారం తెల్లవారుజాము నుంచే గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు పాలు, అన్నప్రసాదం, పానీయాలు, అల్పాహారాన్ని టీటీడీ అందించింది.
2,000 మంది శ్రీవారి సేవకులతో సేవలు
భక్తులకు అన్నప్రసాదం, తాగునీటి పంపిణీతోపాటు రద్దీ నియంత్రణ, చిన్నారులకు ట్యాగింగ్ తదితర సేవల కోసం సుమారు 2,000 మంది శ్రీవారి సేవకులను ప్రత్యేకంగా నియమించారు.
600 మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ
భక్తులకు అందుతున్న సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షించేందుకు టీటీడీ సుమారు 600 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది.
తిరుమలలోని ఎనిమిది కీలక ప్రాంతాల్లో సెక్టోరల్ అధికారులను ఏర్పాటు చేసి 24 గంటలపాటు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తరచూ ఏర్పాట్లను పరిశీలించిన ఉన్నతాధికారులు
టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి గ్యాలరీలను ఎప్పటికప్పుడు పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. భక్తుల నుంచి నేరుగా అభిప్రాయాలను కూడా సేకరించారు.
జేఈవోలు డాక్టర్ ఎ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్ శిలాతోరణం నుంచి వెలుపలికి వచ్చే క్యూలైన్లను సందర్శించి అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించారు.
టీటీడీ సీవీఎస్వో శ్రీ కే వి మురళీకృష్ణ, ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు గ్యాలరీలు, వెలుపలి క్యూలైన్లలో రద్దీ నియంత్రణను నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

















