RAJA GOPURA PRATISTA _ శాస్త్రోక్తంగా కోసువారిప‌ల్లి శ్రీ ప్రసన్నవేంకటరమణ స్వామివారి రాజ‌గోపుర ప్ర‌తిష్ట‌

TIRUPATI, 03 FEBRUARY 2025:  The Raja Gopura Pratista ceremony of Sri Prasanna Venkateswara Swamy temple at Kosuvaripalle in Tamballapalle Mandal was observed in a religious manner on Monday.

Special Grade DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath, Ritwiks and others participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా కోసువారిప‌ల్లి శ్రీ ప్రసన్నవేంకటరమణ స్వామివారి రాజ‌గోపుర ప్ర‌తిష్ట‌

తిరుపతి, 2025 ఫిబ్ర‌వ‌రి 03: తంబళ్లపల్లె మండలం కోసువారిప‌ల్లిలో శ్రీ ప్రసన్నవేంకటరమణస్వామివారి ఆలయంలో సోమ‌వారం ఉద‌యం రాజగోపుర కలశ స్థాపన చేసి హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో మహాకుంభారాధన‌, చతుస్థానార్చన, మూలమూర్తి హోమములు, ప్రాణ ప్రతిష్ట హోమం, గర్త పూజ, పిండికాపూజ, యంత్ర స్థాపన, మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, రాజగోపుర మహా కుంభ సంప్రోక్షణ నిర్వ‌హించారు. అనంత‌రం మంగళ నీరాజనం, ఆచార్య బహుమానం అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్‌, రిత్వికులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.