ADDL EO, CVSO AND SP REVIEW ON V-DAY ARRANGEMENTS _ వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌పై సివిఎస్వో, అర్బ‌న్ ఎస్పీ స‌మీక్ష‌

Tirumala, 11 Dec. 19: The TTD cops along with district police have discussed in elaborate and decided to chalk out a concrete security plan for the upcoming mega religious event in Tirumala, the Vaikuntha Ekadasi which occurs on Janurary 6 next.

A high-level security meeting was held at Annamaiah Bhavan in Tirumala on Wednesday evening where in TTD CVSO Sri Gopinath Jatti and Tirupati Urban SP Dr Gajarao Bhupal discussed in length with their deputies over security arrangements.

AVSO Sri Gangaraju has presented a power point presentation of the series of Vaikuntha Ekadasis held in the years 2016 and 2017 and challenges faced in controlling the pilgrims and the measures took to overcome these challenges during the previous V-day. 

Additional CVSO Sri Siva Kumar Reddy, ASP Sri Maheswara Raju, Sri VGOs Sri Manohar, Sri Prabhakar, DSP Sri Prabhakar and other Vigilance officers and police officers also took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌పై సివిఎస్వో, అర్బ‌న్ ఎస్పీ స‌మీక్ష‌

డిసెంబరు 11, తిరుమ‌ల‌, 2019: తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా విశేష సంఖ్య‌లో విచ్చేసే భ‌క్తుల‌కు భ‌ద్ర‌తాప‌రంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేప‌ట్టాల్సిన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ గ‌జ‌రావ్ భూపాల్ తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా 2016, 2017 సంవ‌త్స‌రాల్లో వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా ఎదురైన స‌వాళ్ల‌పై ఎవిఎస్వో శ్రీ గంగ‌రాజు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. గ‌తంలో ఎదురైన స‌మ‌స్య‌లు పున‌రావృతం కాకుండా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌నే విష‌యంపై చ‌ర్చించారు.

ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎఎస్పి శ్రీ మ‌హేశ్వ‌ర‌రాజు, విఎస్వోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ ప్ర‌భాక‌ర్‌, డిఎస్పి శ్రీ ప్ర‌భాక‌ర్ ఇత‌ర విజిలెన్సు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.