KARTHIKA DEEPAM OBSERVED WITH UTMOST RELIGIOUS FERVOUR IN TIRUMALA _ శ్రీవారి ఆలయంలో శోభాయ‌మానంగా కార్తీక దీపోత్సవం

Deepam Jyothi Parabrahma deepam sarva tamopaham
Deepena sadhyate sarvam sandhya deepam namostute

Tirumala, 11 Dec. 19: The hill shrine of Tirumala dazzled in the lights of ghee lit lamps as a part of Karthika Parva Deepotsavam on Wednesday night.

The entire temple premises starting from Main Entrance to Garbha Griham, Sub-Shrines etc. have been lit with a galaxy of ghee lit lamps.

The temple assumed a noval beauty in the brightness of ghee lit lamps. The specially designed traditional mud pot called “Mookullu” filled with desi ghee with a wick in the middle is lit with a twilight, which is carried in a procession initially by the Jiyangar Swamijis of Tirumala, TTD mandarins and other officials. 

Later the entire temple premises is lit with the mud lamps giving the abode of Lord Venkateswara a Bhooloka Vaikuntha look.

Meanwhile TTD has cancelled Vasanthotsavam and Sahasra Deepalankara Seva along with Pournami Garuda Seva in connection with the Karthika Parva Deepotsavam on Wednesday.

TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Tirupati Urban SP Dr Gajarao Bhupal, TTD Board Members Sri DP Anantha, Sri Shivakumar, VGO Sri Manohar, Temple DyEO Sri Haridranth, Peishkar Sri Lokanadham and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీవారి ఆలయంలో శోభాయ‌మానంగా కార్తీక దీపోత్సవం

డిసెంబరు 11, తిరుమ‌ల‌, 2019: తిరుమల శ్రీవారి అలయంలో బుధ‌వారం సాయంత్రం కార్తీక ప‌ర్వ‌దీపోత్సవం ఘనంగా జ‌రిగింది. కార్తీక పౌర్ణ‌మినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నులపండుగగా నిర్వ‌హించారు.

ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప‌క్కనవున్న పరిమళం అర దగ్గర కొత్త మూకుళ్ల‌లో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాకవారి అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వ‌ద్ద నేతిజ్యోతులను మంగళవాయిద్యాల న‌డుమ‌ వేదమంత్రోచ్ఛారణతో ఏర్పాటు చేశారు.

ఈ కార్తీక దీపోత్సవంలో టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.