FESTIVAL OF LIGHTS OBSERVED IN ALL LOCAL TEMPLES OF TTD _  టిటిడి స్థానికాల‌యాల్లో ఘ‌నంగా కార్తీక దీపోత్సవం

Tirupati, 11 Dec. 19: The most auspicious event, Karthika Deepotsavam was celebrated with religious fervour in all the TTD local temples in  and around Tirupati on Wednesday evening.

Karthika Deepam is a festival of lights that is observed by Hindus in the month of Kārthika (mid-November to mid-December). This occurs on theiday when the moon is in conjunction with the constellation Karthika (Pleiades) and Pournami.

The festival will be observed in the most colourful manner by decorating the temple premises with ghee lit lamps all over in the evening.

This event was observed in a grand manner at Sri Kodanda Rama Swamy temple, Sri Govinda Raja Swamy temple, Sri Padmavathi Ammavari temple, Narayanavanam and Karvetinagaram temples of TTD in a big way.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

టిటిడి స్థానికాల‌యాల్లో ఘ‌నంగా కార్తీక దీపోత్సవం

తిరుపతి, 2019 డిసెంబరు 11: టిటిడి స్థానికాల‌యాల్లో బుధ‌వారం కార్తీక దీపోత్స‌వం వైభ‌వంగా జ‌రిగింది. ఇందులో భాగంగా ఆయా ఆల‌యాల‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో

తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో బుధ‌వారం కార్తీక దీపోత్స‌వం ఘనంగా జ‌రిగింది. ఇందులో భాగంగా ఉద‌యం అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌ను శుక్ర‌వార‌పు తోట‌కు వేంచేపు చేసి ఉద‌యం 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు అభిషేకం నిర్వ‌హించారు.  
          
అనంత‌రం సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు కార్తీక దీపోత్స‌వం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో దీపాలు వెలిగించారు. 

శ్రీ కోదండరామాలయంలో

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో కార్తీక దీపోత్స‌వం ఘనంగా నిర్వ‌హించారు.  శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు  శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా ఆల‌యానికి తీసుకువ‌చ్చారు. ఆ తరువాత స్వామివారికి కార్తీక దీపోత్సవ ఆస్థానం నిర్వహించారు. 

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ గోవింద‌రాజస్వామివారు క‌పిలతీర్థానికి వేంచేపు చేసి తిరిగి ఉద‌యం 10 గంట‌ల‌కు ఆల‌యానికి చేరుకున్నారు. 

అనంత‌రం సాయంత్రం 5 గంట‌లకు శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి కార్తీక దీపం, వ‌స్త్రాలు ఊరేగింపుగా శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యానికి చేరుకున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో దీపాలు వెలిగించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారికి ఆస్థానం నిర్వహించారు. టిటిడి తిరుపతి జెఇఓ శ్రీ పి.బసంత్ కుమార్ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.