VEDIC SCIENCE MEET HELD _ ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో వేద విజ్ఞానంపై సదస్సు

Tirupati, 25 November 2022: TTD on Friday organised a special conference on co-ordinated Vedic sciences with Ayurveda at the SV Ayurveda college.

 

Highlight of the intellectual meet was an interesting lecture by NRI scientist Sri Ayyagari Sitaram Sharma on the theme of  Aruna Prashna (Suryopanishad) in Taittiriya Aranyakam of Krishna Yajurveda.

 

Sri Sharma presented a quantum graphics on the theme by collage of ancient knowledge with modern science. He said research on various tenets of Vedic knowledge would certainly beget valuable fruits to society.

 

Tirupati Veda SaMskuti samiti Secretary Smt BK Lalita, College Principal Dr Murali Krishna, Vice Principal Dr Sundaram, lecturers Dr Venkata Shivudu, Dr Kalpana, Dr Pallavi and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో వేద విజ్ఞానంపై సదస్సు

 తిరుపతి, 2022 నవంబరు 25: శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో శుక్రవారం వేద విజ్ఞానాన్ని ఆయుర్వేదంతో సమన్వయం చేస్తూ ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఇందులో కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయ అరణ్యకంలో గల అరుణ ప్రశ్న(సూర్యోపనిషత్) అనే అంశంపై ప్రవాస భారతీయులైన శ్రీ అయ్యగారి సీతారామ శర్మ ఉపన్యసించారు.

అరుణ ప్రశ్నలో పొందుపరిచిన అనేక ప్రాచీన అంశాలను ఆధునిక శాస్త్రంతో సమన్వయం చేసి, మంత్రార్థాలు వాటి వివరణను క్వాంటం ఫిజిక్స్ తో పోలుస్తూ తెలియజేశారు. వేద అంశాలపై వివిధ శాస్త్రాలకు సంబంధించిన వారు పరిశోధన చేయడం వల్ల సత్యశోధన చేయవచ్చని, ఆధునిక సమాజానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి వేద సంస్కృతి సమితి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ శ్రీమతి బికె.లలిత, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరం, అధ్యాపకులు డాక్టర్ వెంకట శివుడు, డాక్టర్ కల్పన, డాక్టర్ పల్లవి ఇతర అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.