ALSO PROVIDE PRACTICAL CLASSES ON YOGA DARSHANAM-PILGRIM CALLER _ ఎస్వీబీసీలో త్వరలో యోగాపై శిక్షణ

TIRUMALA, 03 DECEMBER 2022:  While appreciating the “Yoga Darshanam” programme of TTD being telecasted live on SVBC everyday evening between 6pm and 7pm, a pilgrim caller Sri Ramu sought to teach practical classes on the same.

During the monthly Dial your EO programme held at Annamaiah Bhavan in Tirumala on Saturday, TTD EO Sri AV Dharma Reddy has received calls from 33 pilgrims from across the country. A young pilgrim sought the EO to provide a practical training session of Yoga Darshanam to which EO answered the idea is already on chords and will be introduced soon.

Another caller Sri Vivekananda from Telengana state brought to the notice of EO that the rice being served at Annaprasadam Complex is not qualitative and well cooked to which the EO replied that the rice will be very soon replaced with the Go Adharita Rice(natural farming) which is being procured from MARKFED for better taste, quality and hygiene.

Callers Smt Vedavalli from Chennai, Sri Raja from Toottukudi of Tamilnadu, Sri Veeraswamy from Tanuku,poured in appreciation on the various dharmic programmes being telecasted on SVBC Tamil and Telugu respectively.

While callers Sri Swamy, Sri Siva Rao from Ponnur sought EO to include Asthma patients also under the Disabled category of pilgrims to which the EO replied he will verify the possibilities.

Another pilgrim caller Sri Govindarajan from Tiruchanoor brought to the notice of TTD EO about the stray cattle in different places in Tirupati, to which the EO replied, TTD has been taking care of the stray cattle also. “If any one brings to our notice, we are taking them to our Palamaner Gosala and providing them enough care”, he maintained.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఎస్వీబీసీలో త్వరలో యోగాపై శిక్షణ

– డయల్ యువర్ ఈఓలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2022 డిసెంబరు 03: యోగదర్శిని కార్యక్రమంలో భాగంగా త్వరలో ఎస్వీబీసీ లో యోగాపై ప్రాక్టికల్ గా శిక్షణ ఇస్తామని టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈఓ భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

1.హరిబాబు – మార్కాపురం, సూర్యనారాయణ – మచిలీపట్నం.

ప్రశ్న : తిరుమలకు నడిచి వచ్చే భక్తులకు త్వరగా దర్శనం కల్పించండి.

ఈఓ: తిరుపతిలో మూడు ప్రాంతాల్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నాం. టోకెన్లు పొందిన భక్తులకు నిర్దేశిత సమయంలో దర్శనం కల్పిస్తున్నాం.

2. వివేకానంద – తెలంగాణ

ప్రశ్న : అన్నదాన భవనంలో అన్నం సరిగా ఉండడం లేదు. కాషన్ డిపాజిట్ మూడు నాలుగు రోజులైనా రావడం లేదు.

ఈఓ : ప్రస్తుతం టెండర్ ద్వారా బియ్యం కొనుగోలు చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన నాణ్యమైన బియ్యాన్ని రైతు సాధికార సంస్థ ద్వారా కొనుగోలు చేసి భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తాం. కాషన్ డిపాజిట్ భక్తులకు సరిగానే అందుతోంది. చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.

3. యాదగిరి – హైదరాబాద్

ప్రశ్న : వృద్ధులు ఆన్లైన్లో బుక్ చేసుకున్న సమయంలో రాంభగీచా, వరాహస్వామి విశ్రాంతి గృహాల్లో గదులు కేటాయించండి.

ఈఓ : పరిశీలిస్తాం

4.లలిత-శ్రీకాకుళం, అనంతాళ్వార్ – అనకాపల్లి

ప్రశ్న : శ్రీవారి ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు తోపులాట ఎక్కువగా ఉంది. ఆలయంలో కొందరు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు.

ఈఓ : రోజుకు 80 వేల నుంచి 90 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వెండి వాకిలి వద్ద భక్తులను తిరిగి పంపేటప్పుడు తోపులాట లేకుండా చూస్తాం. ప్రవర్తనకు సంబంధించి సిబ్బందికి తగిన సూచనలిస్తాం.

5. యశ్వంత్ – ప్రొద్దుటూరు

ప్రశ్న : వైకుంఠ ఏకాదశి టికెట్లు ఆన్లైన్ లో ఎప్పుడు విడుదల చేస్తారు.

ఈఓ : త్వరలోనే విడుదల చేస్తాం.

6. గిరీశం – నెల్లూరు, రామలక్ష్మి – తూర్పుగోదావరి

ప్రశ్న : ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్న ఆన్లైన్లో అంగ ప్రదక్షిణ టోకెన్లు దొరకడం లేదు.

ఈఓ: అంగప్రదక్షిణ టోకెన్లు రోజుకు 700 మాత్రమే ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. టికెట్లు తక్కువగా ఉండడంతో త్వరగా బుక్ అయిపోతున్నాయి. ఎవరూ బ్లాక్ చేయడానికి అవకాశం లేదు.

7. ఆదిత్య – వైజాగ్

ప్రశ్న : సేవకు వచ్చాను. గదుల కోసం భక్తులు గంటలు తరబడి వేచి ఉండడం గమనించాను.

ఈఓ: తిరుమలలో 7000 గదులు మాత్రమే ఉన్నాయి. వీటిలో 50% గదులు అడ్వాన్స్ రిజర్వేషన్ కోసం ఆన్లైన్లో ఉంచడం జరుగుతుంది. గదులపై కాస్త ఒత్తిడి ఉంది. భక్తులు తిరుపతిలో కూడా బస చేసి దర్శనానికి తిరుమలకు రావచ్చు.

8. వేదవల్లి – చెన్నై

ప్రశ్న : ఎస్వీబీసీ తమిళ్ ఛానల్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి.

ఈఓ: ధన్యవాదాలు

9. వీరాస్వామి- కావలి

ప్రశ్న : దాతలకు బ్రేక్ దర్శనం ఆలస్యం అవుతోంది. శ్రీవాణితోపాటు పంపండి.

ఈఓ: బ్రేక్ దర్శనంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని, శ్రీవాణి ట్రస్టు దాతలను, ఇతర దాతలను ప్రాధాన్యత ప్రకారం పంపడం జరుగుతుంది.

10. సుబ్బలక్ష్మి – తణుకు

ప్రశ్న : సహస్రదీపాలంకార సేవలో పాడే అవకాశం కల్పించండి.

ఈఓ: పరిశీలించి తప్పకుండా అవకాశం కల్పిస్తాం.

11. రాము – ఏలూరు

ప్రశ్న : యోగ దర్శనానికి సంబంధించి శిక్షణ ఇప్పించండి.

ఈఓ : ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఎస్ వి వేద వర్సిటీ అధికారులతో చర్చించాం. యోగాపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తాం.

12. నాగేశ్వరరావు- హైదరాబాద్

ప్రశ్న : శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల్లో మోహిని అలంకారంలో అమృత కలశం అలంకరించడం లేదు.

ఈఓ : ఈ అంశాలను జియ్యంగార్లు పర్యవేక్షిస్తారు. వారి దృష్టికి తీసుకెళతాం.

13. శివరావు – పొన్నూరు

ప్రశ్న : ఆస్తమా రోగులకు దివ్యాంగుల కోటాలో దర్శనం కల్పించండి.

ఈఓ: మెడికల్ కమిటీతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం.

14. వినోద్ కుమార్ -తిరుపతి

ప్రశ్న : శ్రీవారి కల్యాణం చేయించుకున్న వారికి చిన్న లడ్డు ఇస్తున్నారు. పెద్ద లడ్డు, వడ ఇవ్వండి.

ఈఓ: శ్రీవారిని దర్శించుకున్న భక్తులందరికీ ఒక లడ్డు ఉచితంగా అందిస్తున్నాం. రెండేళ్లుగా ఈ విధానం చక్కగా అమలవుతోంది. అదనపు లడ్డులు కావలసినవారు కొనుగోలు చేసుకోవచ్చు.


15. గోవిందరాజన్ – తిరుచానూరు

ప్రశ్న : వీధుల్లో తిరిగే గోవులను పోషించండి.

ఈఓ: వీధి పశువులను స్వీకరించి వాటి ఆరోగ్య పరిస్థితిని బాగు చేసి గోవులను ప్రకృతి వ్యవసాయ రైతులకు ఉచితంగా అందజేస్తున్నాం.

16. సరిత – కరీంనగర్

ప్రశ్న : శ్రీవారి సేవకు వస్తున్నాం. సాఫ్ట్వేర్ లోపం కారణంగా తరచూ ఆధార్ కార్డు బ్లాక్ అవుతోంది

ఈఓ : మీ సమస్యను పరిష్కరిస్తాం. శ్రీవారి సేవకులు దళారులకు డబ్బులు చెల్లించి వస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. శ్రీవారి సేవకులు ఆన్లైన్లో నమోదు చేసుకుని సేవకు రండి.

17. వెంకటాద్రి – నెల్లూరు, కృష్ణమూర్తి – బెంగళూరు

ప్రశ్న : శ్రీవారి లడ్డు కాంప్లెక్స్ లో మహిళలకు, పురుషులకు వేరువేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయండి.

ఈఓ : పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.

18. అనిల్ కుమార్ – గోరంట్ల

ప్రశ్న : లడ్డు కౌంటర్ల వద్ద బ్లాక్ లో లడ్డూలు విక్రయిస్తున్నారు. నాకు కాషన్ డిపాజిట్ రిఫండ్ కావడం లేదు.

ఈఓ : లడ్డూ కౌంటర్లను నిర్వహిస్తున్న కె వి ఎం సంస్థ సిబ్బంది లడ్డూలను బ్లాక్ లో విక్రయించినట్లు గుర్తించడంతో 8 మందిపై కేసులు నమోదు చేసాం. విధులనుండి కేవీఎం సంస్థను తొలగించాం. ప్రస్తుతం టిటిడి సిబ్బందితో నిర్వహిస్తున్నాము. కాషన్ డిపాజిట్ కు సంబంధించి మీకు ఫోన్ చేసి వివరాలు తీసుకుంటాం.

19. వెంకమ్మ – ఒంగోలు

ప్రశ్న : శ్రీవారి సేవకు వస్తున్నాను. అన్న ప్రసాద భవనంలో సేవకులనం సరిగా పట్టించుకోవడం లేదు. సేవకుల కోసం ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేయండి.

ఈఓ: మీ సమస్యను పరిష్కరిస్తాం.

20. వెంకటలక్ష్మి – రాజమండ్రి

ప్రశ్న : ప్రోటోకాల్ ప్రముఖుల కారణంగా పర్వదినాల సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతోంది.

ఈఓ: ప్రోటోకాల్ ప్రముఖులకు దర్శనం కల్పించే సంప్రదాయం చాలా ఏళ్ల నుంచి ఉంది. సామాన్య భక్తులకు కూడా సంతృప్తికరంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నాం.

21. రాహుల్ – హైదరాబాద్, శ్రీనివాస్ – వైజాగ్

ప్రశ్న : శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు తదితర టిక్కెట్లు ఆఫ్ లైన్లో ఇవ్వండి.

ఈఓ : అన్ని ప్రాంతాల్లో కౌంటర్లు పెట్టి ఆఫ్ లైన్లో టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఎక్కువమంది భక్తుల కోరిక మేరకు ఆన్ లైన్లో జారీ చేస్తున్నాం.

22. రాజా – తూత్తుకుడి

ప్రశ్న : ఎస్వీబీసీ తమిళ ఛానల్లో రామాయణం ప్రసారం చేయండి

ఈఓ: ఇప్పటికే సుందరకాండ ప్రారంభించాం. ఇతర కాండలన్నీ ప్రసారం చేస్తాం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.