BREAK DARSHAN TIMING CHANGED TO BENEFIT COMMON DEVOTEES _ సామాన్య భక్తుల సౌకర్యం కోసమే బ్రేక్ దర్శన సమయం మార్పు
Tirumala, 03 December 2022: The monthly dial your EO program was held at Annamayya Bhavan in Tirumala on Saturday.
A total of 33 callers directly spoke to TTD EO Sri AV Dharma Reddy over phone and given their feedback.
Before taking the calls, the EO briefed on the various religious events held and going to take place soon. Some important events.
TTD has changed the break Darshan timings to provide Srivari Darshan to common devotees waiting overnight in compartments.
BREAK DARSHAN NOW SHIFTED TO 8AM.
The change saved 3 hours and provided Srivari Darshan to over 15,000 common devotees.
Devotees need not come one day earlier to Tirumala but can now stay at Tirupati and obtain break tickets and come to Tirumala directly for Darshan in morning.
The new initiative reduced pilgrims one day stay at Tirumala and also reduced pressure on TTD for accommodation at Tirumala.
The experimental initiative will be operative for one month.
VAIKUNTA EKADASI ON JANUARY 2
TTD is making arrangements for providing Vaikunta Dwara Darshan from January 2 till January 11 for ten days.
As in last two years, TTD will release daily 25,000 SED (₹300/-) tickets online and for ten days a total of 2.50 lakh tickets.
Devotees from any regions can book their tickets.
Similarly, five lakh SSD tickets @ 50,000 per day for ten days will be alloted in counters at Tirupati.
Devotees can come for Vaikunta Darshan as per time and date allotted to them.
In all TTD is contemplating organising Vaikunta Dwara Darshan for 75,000-80,000 devotees per day.
For the convenience of all devotees only those with either SED or SSD tickets will be allowed entry to Tirumala for Darshan. Others can reach Tirumala but will not be provided Darshan.
TIRUPPAVAI SEVA TO REPLACE SUPRABHATA SEVA FROM DEC 17
With the commencement of Dhanur Masam from December 16 at 6.12 pm, Tiruppavai Seva replaces Suprabata Seva from December 17 morning till January 14 in 2023.
GOLD PLATING OF ANANDA NILAYAM
TTD board has decided gold plating of Ananda Nilayam over a period of six months.
The process will begin with the Balalaya fete on February 23.
TTD will utilise the gold donated by devotees for this project During this period Srivari Darshan will be continued as per the practice that was followed during 1957-58.
OFFLINE BREAK TICKETS TO SRIVANI DONORS AT MADHAVAM REST HOUSE, TIRUPATI
Donors of SRIVANI Trust now getting VIP break tickets at Madhavam rest house from December 1 onwards. They could also get rooms in the same rest house.
BHAGAVADGITA AKHANDA PARAYANAM ON DECEMBER 4
As part of Geeta Jayanti celebrations, TTD is organising the Bhagavadgita Akhanda Parayanam at the Nada Neeranjanam platform on December 4.
Vedic pundits will perform non stop parayanams of 700 shlokas from 18 sargas from morning 7 am onwards and the program will be live telecast by SVBC.
CHAKRA THIRTHA MUKKOTI ON DEC 5
KARTHIKA DEEPOTSAVAM IN TIRUMALA TEMPLE ON DEC 7
Sri Srinivasa Vishwa Shanti Homa at Dharmagiri Veda Vignana Peetham in Tirumala from December 12-18 for the well-being of humanity.
TTD 2023 diaries & calendars are available at TTD information centres at Mumbai, Bangalore, Chennai, New Delhi, Hyderabad, Vijayawada and Visakhapatnam besides Tirumala and Tirupati.
Grand Panchami Thirtha fete was held at Tiruchanoor on November 28.
సామాన్య భక్తుల సౌకర్యం కోసమే బ్రేక్ దర్శన సమయం మార్పు
– డిసెంబరు 17 నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై
– డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2022, డిసెంబరు 03: తిరుమల శ్రీవారి దర్శనం కోసం రాత్రి నుండి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసినట్టు టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. దీనివల్ల ఉదయం లభించే దాదాపు 3 గంటల సమయంలో సుమారు 15,000 మంది భక్తులకు అదనంగా సర్వదర్శనం కల్పించి వారికి వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకే ఈ ప్రణాళిక చేపట్టామన్నారు. భక్తులు ముందురోజు రావాల్సిన అవసరం లేకుండా అదేరోజు తిరుపతిలోనే బసచేసి, తిరుమలకు ఉదయం వచ్చి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చన్నారు. ఇదివరకులా తిరుమలలో ముందురోజు బసచేయవలసిన అవసరం ఉండదని, తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి ఒక నెల తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
జనవరి 2న వైకుంఠ ఏకాదశి :
– జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినం నుండి పది రోజులపాటు అంటే 11/01/2022 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.
– గత రెండు సంవత్సరాల మాదిరి ఈ సంవత్సరం కూడా రోజుకు 25 వేలు చొప్పున 10 రోజులకు కలిపి 2.50 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తాం. దేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
– అదేవిధంగా రోజుకు 50 వేలు చొప్పున 10 రోజులకు కలిపి 5 లక్షల సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను తిరుపతిలో కౌంటర్ల ద్వారా భక్తులకు మంజూరు చేస్తాం. ఈ సర్వదర్శనం టోకెన్లు ఎవరైనా క్యూలైన్లలో ఉండి పొందవచ్చును. వారికి లభించిన టైం మరియు తేదీ ప్రకారం దర్శనానికి రావచ్చు.
అనగా ప్రతిరోజూ 75 వేల దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి.
– దర్శన టికెట్ ఉన్నవారిని మాత్రమే ఆలయంలో దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. దర్శన టికెట్ లేనివారు తిరుమలకు రావచ్చుగానీ దర్శనానికి అనుమతించడం సాధ్యం కాదు.
డిసెంబరు 17 నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై :
– డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభంకానుండడంతో డిసెంబరు 17వ తేదీ నుండి తిరుమల శ్రీవారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2023, జనవరి 14న ముగుస్తాయి.
ఆనందనిలయానికి బంగారు తాపడం :
– టిటిడి ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం ఫిబ్రవరి 23 నుంచి బాలాలయ నిర్మాణం ప్రారంభిస్తాం. 6 నెలల్లో తాపడం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం.
– ఈ సమయంలో శ్రీవారి దర్శనం కొనసాగుతుంది. తాపడం కోసం భక్తులు సమర్పించిన బంగారాన్ని మాత్రమే వినియోగిస్తాం. ఈ సమయములో స్వామివారి దర్శనానికి 1957-58 సంవత్సరంలో టిటిడి అనుసరించిన విధానాన్నే అనుసరిస్తాం.
శ్రీవాణి దాతలకు మాధవంలో ఆఫ్‌లైన్ టికెట్లు :
– శ్రీవాణి ట్రస్టు దాతల కోసం డిసెంబరు 1 నుండి తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో ఆఫ్‌లైన్ దర్శన టికెట్లు కేటాయిస్తున్నాం. బస చేసేందుకు గదులు కూడా అక్కడే మంజూరు చేస్తున్నాం.
డిసెంబరు 4న భగవద్గీత అఖండ పారాయణం :
– గీతా జయంతిని పురస్కరించుకొని డిసెంబరు 4న ఆదివారం తిరుమల నాదనీరాజనం వేదికపై భగవద్గీతలోని 18 ఆధ్యాయాల్లో గల 700 శ్లోకాలను పండితులు నిరంతరాయంగా పారాయణం చేస్తారు. ఉదయం 7 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.
డిసెంబరు 5న చక్రతీర్థ ముక్కోటి :
– తిరుమలలో ప్రతి ఏడాదీ తమిళ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడి శ్రీ చక్రత్తాళ్వారుకు, శ్రీనరసింహస్వామి వారికి, శ్రీఆంజనేయస్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు.
డిసెంబరు 7న కార్తీక పర్వదీపోత్సవం :
– తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 7న కార్తీక పర్వదీపోత్సవం నిర్వహిస్తాం. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన తరువాత ఆలయంలో కన్నులపండుగగా దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది.
శ్రీ శ్రీనివాస విశ్వశాంతిహోమం :
– మానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో డిసెంబరు 12 నుండి 18వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం నిర్వహిస్తాం.
భక్తులకు అందుబాటులో 2023 టిటిడి డైరీలు, క్యాలెండర్లు :
– టిటిడి ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి.
– తిరుమల, తిరుపతితోపాటు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢల్లీి, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం.
పంచమితీర్థంనాడు విశేష సంఖ్యలో భక్తుల పవిత్రస్నానం :
– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 20 నుండి 28వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చివరిరోజు పంచమితీర్థం రోజున వేలాది మంది భక్తులు సేద తీరేందుకు జర్మన్ షెడ్లు, వారికి విరివిగా అన్నప్రసాదాలు, తాగునీరు, టి, పాలు తదితర ఏర్పాట్లు చేపట్టాం.
నవంబరు నెలలో నమోదైన వివరాలు :
దర్శనం :
– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 22.77 లక్షలు.
హుండీ :
– హుండీ కానుకలు – రూ.127.31 కోట్లు.
లడ్డూలు :
– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 1.03 కోట్లు.
అన్నప్రసాదం :
– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 43.13 లక్షలు.
కల్యాణకట్ట :
– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 8.91 లక్షలు.
ఈ కార్యక్రమంలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.