EIGHTY THOUSAND PILGRIMS TO GET VAIKUNTHA DWARA DARSHAN ON EACH DAY FROM JAN 2 TO 11-TTD EO _ జనవరి 2 నుండి 11వ తేదీ వరకు రోజుకు 80 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం: టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
75THOUSAND TICKETS INCLUDES SSD AND SED ON EACH DAY
TTD DISPENSES WITH ALL PRIVILEGED DARSHANS DURING THE TEN DAYS
ALL ARJITA SEVAS IN EKANTAM
DEVOTEES FROM BACKWARD AREAS TO GET VAIKUNTHA DWARA DARSHAN
TEN CENTERS EARMARKED FOR SSD TOKENS
ONE COUNTER IN TIRUMALA EXCLUSIVELY FOR TIRUMALA RESIDENTS
2000 SRIVANI TICKETS IN ONLINE EACH DAY DURING TEN DAYS
MAHA LAGHU DARSHAN FOR ALL INCLUDING SRIVANI TICKET HOLDERS DURING TEN DAYS
DARSHAN FOR COMMON PILGRIMS TO COMMENCE AFTER 5AM
TIRUMALA, 03 DECEMBER 2022: With an aim to facilitate Vaikuntha Dwara Darshan to more common pilgrims, TTD has dispensed with all other formats of privileged Seva and Arjita Sevas from January 2 to 11, said TTD EO Sri AV Dharma Reddy.
After a detailed review meeting with the senior officers of various departments at Annamaiah Bhavan in Tirumala on Saturday over the arrangements on the ensuing Vaikuntha Ekadasi Dwara Darshanam, the EO briefed the media on the important decisions. Excerpts from the meeting:
The auspicious day of Vaikuntha Ekadasi occurs on January 2 and Vaikuntha Dwadasi on January 3 in 2023. But following the practice of opening the Vaikuntha Dwara Darshan for ten days as in the last two years, TTD will enable the unique Vaikuntha Dwara Darshan till January 11.
After the early morning rituals including Tiruppavai, Dhanurmasa Kainkaryams, Bali, Sattumora Suddhi, First Bell etc.,the darshan will commence at 5am for common pilgrims(tentatively). On a day, nearly 80thousand pilgrims will be provided Darshan. TTD has dispensed with all privileged darshans while the Arjitha Seva will be observed in Ekantam. Devotees having SRIVANI, SED tickets and SSD token holders will be provided with “Maha Laghu Darshan”(from Jaya-Vijaya) point only.
RELEASE OF TICKETS
TTD will release 25000 tickets of Rs.300 SED everyday and for these ten days 2.50lakhs tickets will be released on-line. All these tickets will be released while the online quota for the entire month of January 2023 is released on-line.
A total of five lakh tokens of SSD will be issued with 50,000 tokens on each day at ten venues with nine in Tirupati and one at Tirumala which is exclusively earmarked for Tirumala locals. Adhar card is mandatory to procure tickets to avoid duplication.
The nine places where SSD tokens will be issued will be divided into two clusters and each one will be under the supervision of JEO Tirupati and JEO Education respectively. While the CVSO in coordination with the District authorities will ensure security measures at all points.
Every day 2000 SRIVANI tickets will be released on-line during these ten days. Everyday 2000 donors shall also book their darshan quota online.
Only Self-Protocol VIPs alone will be allotted darshan tickets and no recommendation letters will be entertained for Vaikuntha Ekadasi.
ACCOMMODATION
Advance booking of accommodation will be cancelled from December 29 to January 3 in view of New Year, Vaikuntha Ekadasi and Dwadasi.
For registration of accommodation only CRO will operate by opening up more counters to have transparency in allotment of accommodation.
LIVE PROGRAMMES
Akhanda Vishnu Sahasranama Parayanam will be performed at Nada Neerajanam in Tirumala on January 2 on the auspicious occasion of Vaikuntha Ekadasi.
The procession of Swarna Ratham will be observed between 9am and 11am.
On January 3, Vaikuntha Dwadasi, Swami Pushkarini Theertha Mukkoti will take place where in Sri Sudarshana Chakrattalwar will be rendered Snapanam followed by Avabhrida Snanam.
All the programmes will be telecasted live on SVBC.
OTHERS
Floral decorations will be made matching the occasion.
Srivari Sevaks, NCC Cadets will be deployed to render services to the multitude of visiting pilgrims
Annaprasadam, Health, Medical wings will execute their respective responsibilities.
JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, other HoDs, DyEOs, Senior Officers were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జనవరి 2 నుండి 11వ తేదీ వరకు రోజుకు 80 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం: టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
– ఇందులో ఎస్ఎస్డి, ఎస్ఇడి కలిపి రోజుకు 75 వేల టికెట్లు
– అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు
– ఏకాంతంగా అన్ని అర్జిత సేవలు
– వెనుకబడిన ప్రాంతాల భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం
– ఎస్ఎస్డి టోకెన్ల కోసం మొత్తం పది కేంద్రాలు
– ఇందులో స్థానికుల కోసం ప్రత్యేకంగా తిరుమలలో ఒక కౌంటర్
– ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో 2000 శ్రీవాణి టికెట్లు
– శ్రీవాణి దాతలు సహా అందరికీ మహా లఘుదర్శనం
– ఉదయం 5 గంటల నుండి సామాన్య భక్తులకు దర్శనం
తిరుమల, 2022 డిసెంబరు 03: ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేసినట్టు, అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లపై శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవి.
2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి జరుగనుంది. వస్తుంది. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధంగానే జనవరి 11 వరకు పది రోజుల పాటు టిటిడి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. జనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రోజుకు దాదాపు 80 వేల మందికి దర్శనం కల్పించనున్నారు. ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్ఇడి టిక్కెట్లు, ఎస్ఎస్డి టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు “మహా లఘు దర్శనం” కల్పిస్తారు.
దర్శన టికెట్లు
రోజుకు 25 వేలు చొప్పున 10 రోజులకు కలిపి 2.50 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 2023 జనవరి కోటాలోనే ఈ టికెట్లు విడుదల చేస్తారు. తిరుమల స్థానికుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కౌంటరుతో పాటు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో రోజుకు 50 వేలు చొప్పున మొత్తం ఐదు లక్షల ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తారు. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చూపి ఈ టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్‌లుగా విభజించి జెఇఓలు పర్యవేక్షిస్తారు.
రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ప్రతిరోజూ 2000 మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే దర్శన టిక్కెట్లు కేటాయిస్తారు. సిఫార్సు లేఖలు తీసుకోబడవు.
వసతి
నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్ట్యా డిసెంబర్ 29 నుండి జనవరి 3 వరకు వసతి అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేస్తారు. గదుల కేటాయింపులో పారదర్శకత పెంచేందుకు మరిన్ని కౌంటర్లు పెంచి సిఆర్వోలో మాత్రమే కేటాయిస్తారు.
ప్రత్యక్ష ప్రసారాలు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 2న తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అఖండ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుంది. జనవరి 3వ తేదీన వైకుంఠ ద్వాదశి రోజున స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ స్నపనం అనంతరం చక్రస్నానం చేస్తారు. అన్ని కార్యక్రమాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
అదేవిధంగా, సందర్భానుసారంగా పుష్పాలంకరణలు చేయనున్నారు. శ్రీవారి సేవకులు, ఎన్‌సిసి క్యాడెట్‌లతో భక్తులకు సేవలందించనున్నారు.
జెఇఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్‌వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్‌విబిసి సిఇఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఇ 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.