టిటిడి స్థానికాలయాల్లో ఆణివార ఆస్థానం
టిటిడి స్థానికాలయాల్లో ఆణివార ఆస్థానం
తిరుపతి, 2019 జూలై 17: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయంలో బుధవారం ఆణివార ఆస్థానం ఘనంగా జరిగింది.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు బంగారు వాకిలి వద్ద ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆస్థానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.