ANKURARPANA HELD FOR YAGAM _ తిరుమల‌లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీ యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Tirumala, 3 Apr. 22: Ankurarpanam for Sri Lakshmi Srinivasa Dhanwantari Yagam held at Dharmagiri Veda Vignana Peetham in Tirumala on Sunday evening.

According to Agama Advisor Sri Mohana Rangacharyulu, seeking the divine blessings this three-day Yagam has been mulled by TTD for the sake of world peace, health and prosperity.

The Yagam commences at 9am on Monday and concludes with Purnahuti on April 6 at 12noon.

A total of a dozen ritwiks under the supervision of the Dharmagiri Peetham Principal Sri Kuppa Siva Subramanya Avadhani will perform the Maha Yagam which will be aired live on SVBC between 11 am and 12 noon for the sake of global devotees.

TTD Additional EO Sri AV Dharma Reddy participated in the religious ritual.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల‌లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీ యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 03: తిరుమ‌ల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు పాల్గొన్నారు.

శ్రీ‌వారి అనుగ్ర‌హంతో శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రం ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రు ఆయురారోగ్యాల‌తో, సిరి సంప‌ద‌ల‌తో ఉండాల‌ని మూడు రోజుల పాటు టిటిడి యాగం నిర్వ‌హింస్తోంద‌ని వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు తెలిపారు. ఏప్రిల్ 4 నుండి 6వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. ఏప్రిల్ 6వ తేదీ ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల మ‌ధ్య‌ పూర్ణాహుతితో ముగుస్తుంద‌ని వివ‌రించారు.

ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో 12 మంది ప్ర‌ముఖ రుత్వికులు ఈ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీ యాగం నిర్వ‌హించునున్నారు.

ప్రతిరోజూ ఉదయం 11 నుండి 12 గంటల వ‌ర‌కు ఎస్వీబిసిలో ఈ కార్య‌క్ర‌మం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.