GARUDA SEVA HELD _ గరుడ వాహనంపై సీతాపతి

TIRUPATI, 03 APRIL 2022: The Garuda Seva was observed with celestial grandeur in Sri Kodanda Rama Swamy Temple at Tirupati on Sunday evening.

As a part of the ongoing annual brahmotsavam, Sri Ramachandra Murty took out celestial ride on mighty Garuda Vahanam to bless His devotees along four Mada streets.

Earlier, the processional of sacred padalu to be decked to the utsava deity for Garuda Seva was held.

Devotees offered Harati at all the points chanting Sri Rama Nama with utmost devotion.

Both the seers of Tirumala, JEO Sri Veerabrahmam, Spl. Gr. DyEO Smt Parvati and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గరుడ వాహనంపై సీతాపతి
 
 
తిరుపతి, 2022 ఏప్రిల్ 03: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన సేవ  10 గంటలవరకు సాగుతుంది.  భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
 
 
నవాహ్నిక బ్రహ్మూత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.
 
 
శ్రీరామచంద్రమూర్తి పాదాల ఊరేగింపు :
 
 
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారికి గరుడసేవలో అలంకరించేందుకు శ్రీరామచంద్రమూర్తి పాదాలను ఉదయం ఆలయ నాలుగు మాడవీధుల్లో ఉరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు. 
 
 
వాహ‌న‌సేవ‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, విజిఓలు శ్రీ మనోహర్, శ్రీ బాలిరెడ్డి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
 
టీటీడీ  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.