ANKURARPANAM ON MARCH 05 _ మార్చి 5న తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మార్చి 5న తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
– బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, 2025 మార్చి 03: తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో మార్చి 6 నుండి 14వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు మార్చి 5వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణ నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
06-03-2025
ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8 నుండి 8.30 గంటల మధ్య మీన లగ్నంలో)
రాత్రి – హంసవాహనం,
07-03-2025
ఉదయం – ముత్యపుపందిరి వాహనం
రాత్రి – హనుమంత వాహనం
08-03-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సింహ వాహనం
09-03-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – పెద్దశేష వాహనం
10-03-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – గజవాహనం
11-03-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – సర్వభూపాల వాహనం(సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు) కల్యాణోత్సవం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు),
గరుడ వాహనం( రాత్రి 11 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు)
12-03-2025
ఉదయం – రథోత్సవం
రాత్రి – ధూళి ఉత్సవం
13-03-2025
ఉదయం – సూర్యప్రభవాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం (సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు), పార్వేట ఉత్సవం( రాత్రి 7 నుండి 8 గంటల వరకు), అశ్వ వాహనం (రాత్రి 8.30 నుండి 10.30 గంటల వరకు)
14-03-2025
ఉదయం – వసంతోత్సవం (ఉదయం 7 నుండి 9 గంటల వరకు), చక్రస్నానం (మధ్యాహ్నం 12.05 గంటలకు)
రాత్రి – ధ్వజావరోహణం. ( రాత్రి 8 గంటలకు)
మార్చి 15వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.