ANNABHISHEKAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం

Tirupati, 31 October 2020: TTD organised grand Annabhisekam at the Sri Kapileswara Swamy Temple on Saturday in ekantham in view of COVID-19 restrictions.

After morning suprabatha seva Abhisekam was performed. Thereafter in the noon   after Shuddodaka abhisekam, the holy Annabhisekam was conducted for the Mula murti  (Maha lingam) of Sri Kapileswara Swamy.

Nearly 150 kgs of cooked rice was used in the abhisekam.

As part of the ritual the Annaprasadam is removed and the another abhisekam is performed with scented perfumed waters to the Maha lingam in the evening.

DyEO of temple Sri Subramaniam, VGO Sri Bali Reddy, superintendent Sri Bhupathi, Inspector Sri Reddy Sekhar and temple Archakas were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం

తిరుప‌తి, 2020 అక్టోబ‌రు 31: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం అన్నాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో అన్నాభిషేకం ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా  ఉద‌యం సుప్రభాత సేవ‌తో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) ఏకాంతంగా అన్నాభిషేకం చేశారు. అంతకుముందు శుద్దోదకంతో శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం జరిగింది.

అనంతరం సుమారు 150 కిలోలకు పైగా బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానవ‌ట్టం మరియు లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు. సాయంత్రం 5 గంటలకు అన్నలింగానికి ఉద్వాసన చేసి, స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, విజివో శ్రీ బాలిరెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య‌ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.