TTD EMPLOYEES PLEDGE TO END CORRUPTION _ అవినీతికి వ్య‌తిరేకంగా టిటిడి ఉద్యోగుల ప్ర‌తిజ్ఞ‌

Tirumala, 31 October 2020: As part f vigilance awareness week, the TTD employees on Saturday took a pledge to fight corruption and maintain integrity of institution with dedication in the devotees service.

The oath-taking ceremony was held at the Srivari Seva Sadan as part of the ongoing Vigilance awareness week held from October 27- November 2 on the directions of the central vigilance commission as a tribute to Steel Man of India Sardar Vallabhai Patel on his birth anniversary.

Under the supervision of the CVSO Sri Gopinath Jatti, the pledge ceremony was held for Vigilance staff, Staff of VQC-1, reception-1 &2, Kalyana Katta staff sand Srivari sevakulu 

‌Speaking on the occassion, the TTD VGO Sri Manohar said the theme of the vigilance week this year is Apramatha Bharat, Sampannna Bharat (a vigilant India, Prosperous Nation).

He said it is duty of every citizen to fight corruption and misuse of office which deterred to all round development of the country.

Personal discipline transformed family and society in general, he said and urged the TTD employees, Srivari sevakulu, taxi drivers, hotels and shop owners to coordinate and selflessly serve the devotees coming to Tirumala for Srivari darshan.

TTD vigilance wing VGO Sri Prabhakar said all TTD employees were made part of the awareness program during the vigilance week celebrations. All devotees are advised to call the toll free numbers so that senior officials are alerted to take action. Flexis are put up in important locations of Tirumala and Tirupati with phone number, and emails of senior vigilance officials, he said.

TTD AEOs Sri CA Ramakantha Rao, Sri Krishna murthy, Sri Rajendra, AVSOs Sri Ganga Raju Sri Veerababu, Sri Pavan Kumar, Sri Venkataramana and vigilance inspectors were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అవినీతికి వ్య‌తిరేకంగా టిటిడి ఉద్యోగుల ప్ర‌తిజ్ఞ‌

తిరుమ‌ల‌, 2020 అక్టోబ‌రు 31: కేంద్ర విజిలెన్స్ క‌మిష‌న్(సివిసి) పిలుపు మేర‌కు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జ‌రుగుతున్న విజిలెన్స్ అవ‌గాహ‌న వారోత్స‌వాల్లో భాగంగా శ‌నివారం తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి సేవా స‌ద‌న్‌లో టిటిడి ఉద్యోగులు అవినీతికి వ్యతిరేకంగా, సంస్థ పట్ల నిబద్ధత క‌లిగి భక్తులకు సేవ చేస్తామని ప్ర‌తిజ్ఞ చేశారు. అక్టోబ‌రు 31న ఉక్కుమ‌నిషి స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌తి ఏటా ఈ వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ ప్ర‌తిజ్ఞ‌ కార్య‌క్ర‌మంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1, 2, రిసెప్ష‌న్‌-1, రిసెప్ష‌న్‌-2, క‌ల్యాణ‌క‌ట్ట సిబ్బంది, భ‌ద్ర‌తా సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా టిటిడి విజివో శ్రీ మ‌నోహ‌ర్ మాట్లాడుతూ అప్ర‌మత్త భారత్‌, సంపన్న భారత్ అనే థీమ్‌తో ఈ ఏడాది విజిలెన్స్ అవ‌గాహ‌న వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. అవినీతి, అధికార దుర్వినియోగం దేశ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయ‌ని, వీటిని అధిగ‌మించ‌డం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌తని అన్నారు. వ్య‌క్తిగ‌త క్ర‌మ‌శిక్ష‌ణ ఉండాల‌ని, తద్వారా కుటుంబానికి, స‌మాజానికి క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌డుతుంద‌ని చెప్పారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులు సంతృప్తిక‌రంగా తిరుమ‌ల యాత్ర పూర్తి చేసుకుని వెళ్లేందుకు ఉద్యోగులు, శ్రీ‌వారి సేవ‌కులు, ట్యాక్సీ డ్రైవ‌ర్లు, హోట‌ళ్లు, దుకాణాల నిర్వాహ‌కులు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

టిటిడి విజిలెన్స్ వింగ్ విజివో శ్రీ ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ ఈ వారోత్స‌వాల్లో భాగంగా టిటిడిలోని అన్ని విభాగాల సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. భ‌క్తులకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురైనా, అవ‌క‌త‌వ‌క‌ల‌ను గుర్తించినా టోల్‌ఫ్రీ నంబ‌ర‌కు తెలియ‌జేయాల‌ని, అక్క‌డి సిబ్బంది సంబంధిత విభాగాల అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తార‌ని చెప్పారు. ఈ మేర‌కు విజిలెన్స్ విభాగం ఫోన్ నంబ‌ర్లు, ఉన్న‌తాధికారుల ఈ-మెయిల్ వివ‌రాల‌తో కూడిన ఫ్లెక్సీల‌ను తిరుమ‌ల‌, తిరుప‌తిలోని ముఖ్య‌మైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఏఈవోలు శ్రీ సిఎ.ర‌మాకాంత రావు, శ్రీ కృష్ణ‌మూర్తి, శ్రీ రాజేంద్ర‌, ఎవిఎస్వోలు శ్రీ గంగ‌రాజు, శ్రీ వీర‌బాబు, శ్రీ ప‌వ‌న్‌‌కుమార్‌, శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ‌, విజిలెన్స్ ఇన్‌స్పెక్ట‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.