ANNUAL PAVITROTSAVAMS CONCLUDES IN SRIVARI TEMPLE _  శ్రీ‌వారి ఆల‌యంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

Tirumala, 1 Aug. 20: The annual three day Pavitrotsavams concluded on a religious note in Sri Venkateswara Swamy temple at Tirumala on Saturday.

The processional deities of Sri Malayappa Swamy along with His two Consorts, Sridevi and Bhudevi were rendered the sacred Snapana Tirumanjanam between 9am and 11am. In the evening, Pavitra Purnahuti was performed between 7pm and 8pm. 

EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Harindranath and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుమల, 2020 ఆగస్టు 01: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శ‌నివారం సాయంత్రం పూర్ణాహుతితో ముగిశాయి.

ఇందులో భాగంగా శ‌నివారం ఉదయం 7.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీంతో స్నపనతిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది.

కాగా, సాయంత్రం 3.00 నుండి 4.00 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు రంగ‌నాయుకుల మండ‌పంలో వేంచేపు చేశారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తరువాత శ్రీ మలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.