APPALAYAGUNTA TEMPLE CLEANSED FOR THE ANNUAL FETE _ అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUPATI, 07 JUNE 2022:  The traditional temple cleaning fete, Koil Alwar Tirumanjanam was observed in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta on Tuesday.

As the annual brahmotsavams of the temple are scheduled from June 10 to 18, the entire temple was cleaned with aromatic ingredient Parimalam between 8am and 10:30am. Later the devotees were allowed for Sarva Darshanam.

Temple Chief Priest Sri Surya Kumaracharyulu, Superintendent Smt Srivani, Temple Inspector Sri Siva Kumar and others were also present.

The important days during annual brahmotsavams includes Dhwajarohanam on June 10, Kalyanotsavam on June 13, Garuda Vahanam on June 14, Rathotsavam on June 17, Chakrasnanam and Dhwajavarohanam on June 18.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2022 జూన్ 07: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రిగింది. ఆల‌యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 10 నుండి 18వ తేదీ వరకు జ‌రుగ‌నున్నాయి. జూన్ 9వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

ఈ సందర్భంగా ఉద‌యం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు నిర్వహించారు. ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేప‌ట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ సూర్య‌కుమారాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ శివ‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

బ్ర‌హ్మోత్స‌వాల్లో వాహ‌న సేవ‌ల వివ‌రాలు…

తేదీ ఉదయం సాయంత్రం

10-06-2022(శుక్ర‌వారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం

11-06-2022(శ‌నివారం) చిన్నశేష వాహనం హంస వాహనం

12-06-2022(ఆదివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

13-06-2022(సోమ‌వారం) కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

14-06-2022(మంగ‌ళ‌వారం) మోహినీ అవతారం గరుడ వాహనం

15-06-2022(బుధ‌వారం) హనుమంత వాహనం గజ వాహనం

16-06-2022(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

17-06-2022(శుక్ర‌వారం) రథోత్సవం అశ్వవాహనం

18-06-2022(శ‌నివారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 13వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.