SV TEMPLE GEARS UP TO OBSERVE THE MAHA SAMPROKSHANAM FETE _ వెంక‌ట‌పాళెంలో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు విస్తృత ఏర్పాట్లు

TIRUPATI, 07 JUNE 2022: As the Maha Samprokshanam fete of the newly built Sri Venkateswara temple at Venkataplaem in Tullur Mandal at Amaravati is scheduled on June 9 in the auspicious Mithuna Lagnam between 7:50am and 8:10am, TTD is gearing up for the mega religious event which will be attended by Honourable Governor, the CM of AP, TTD Chairman and graced by the Pontiff of Visakha Sarada Peetham.

On the day, Agamic rituals including Punyaham, Kumbharadhana, Ukta Homam, Purnahuti, Vimana Gopura Kalasa Avahana Prokshana will be observed before Maha Samprokshanam and Vigraha Pratista. 

Later Veda sattumora, Akshataropanam, Harati, Acharya Bahumanam and Dwajarohanam will be observed. Later the devotees will be allowed for Sarva Darshan of the presiding deity from 10:30am onwards. 

In the evening between 3pm and 4:30pm the celestial wedding Srinivasa Kalyanam will be performed. This will be followed by the procession of utsava idols, Dwajavarohanam. In the evening, after Nitya Kaikaryams, the Ekantha Seva will be observed at 9pm. 

ARRANGEMENTS: TTD has deputed 400 personnel from various departments to look after the arrangements of Maha Samprokshanam and Vigraha Pratista at SV temple. 

About 2.5tonnes of ornamental and traditional flowers will be used to decorate the main temple, presiding and utsava deities and stage decorations with 30 decorators from TTD Garden wing. Besides, 20thousand cut flowers will be used to deck the temple in a splendid way.

TTD has also deployed Annaprasadam, Health(Sanitary), and Security staff to execute their respective responsibilities. 

The Engineering Wing has made elaborate arrangements including stage setup, barricading etc. for the smooth conduct of the event. The other arrangements included 40 mobile toilets, welcome arches at three different places, 50 flexes in vital points, and counters for the display and sale of TTD products.

The Electrical wing of TTD has made special illumination arrangements to enhance the beauty of the temple and its surroundings. Shanku Chakra Tirunamam are arranged with LED lights while special light arrangements are being made to the Gopuram, Vimanama and Alaya Prakaram. Special light decorations have also been made to the stage set up to perform devotional cultural programmes.

To carry out all the religious events as per tenets of Vaikhanasa Agama, TTD has also deputed a team of Acharyas which included one of the Chief Priests of Tirumala temple and also Agama Advisor.

Apart from the regular staff, TTD has also invited Srivari Seva Volunteers from the surrounding places to offer services to the visiting devotees. To render devotional songs, Bhajan Mandalis have also been invited. About 2000 volunteers and bhajan artists will be taking part in the event.

The Maha Samprokshanam of the Sri Venkateswara temple will be telecasted live on SVBC on June 9 for the sake of global devotees by TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వెంక‌ట‌పాళెంలో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు విస్తృత ఏర్పాట్లు

– విచ్చేయ‌నున్న గౌ. గ‌వ‌ర్న‌ర్‌, గౌ. ముఖ్య‌మంత్రివ‌ర్యులు, శార‌ద పీఠాధిప‌తి, టిటిడి ఛైర్మ‌న్

– భ‌క్తుల కోసం జ‌ర్మ‌న్ షెడ్లు, తాగునీరు, అన్న‌ప్ర‌సాదాలు

– ముఖ్య కూడ‌ళ్ల‌లో ఫ్లెక్సీలు, స్వాగ‌త ఆర్చిలు

అమ‌రావ‌తి, 2022 జూన్ 07: గుంటూరు జిల్లా తుళ్లూరు మండ‌లం వెంక‌ట‌పాళెం గ్రామంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో జూన్ 4న ప్రారంభ‌మైన మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. జూన్ 9వ తేదీన గురువారం ఉద‌యం 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాల కోసం టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ఆధ్వ‌ర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టారు.

మ‌హాసంప్రోక్ష‌ణ అంటే…

నూత‌నంగా నిర్మించిన ఆల‌యంలో విగ్ర‌హ‌ప్ర‌తిష్ట చేయ‌డానికి మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ముందుగా విష్వ‌క్సేన‌పూజ‌, అంకురార్ప‌ణం నిర్వ‌హిస్తారు. మ‌రుస‌టి రోజు నుండి ఐదు రోజుల పాటు విగ్ర‌హానికి వివిధ ర‌కాల శుద్ధి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. స్వామివారి శ‌క్తిని కుంభాల్లోకి(క‌ల‌శాలు) ఆవాహ‌న చేసి ప్ర‌తిరోజూ రుత్వికులు నియ‌మ‌నిష్ట‌ల‌తో ఆరాధ‌నలు, ఉక్త‌ హోమాలు చేప‌డ‌తారు. ఈ క్ర‌మంలో విగ్ర‌హానికి మొద‌టిరోజు పంచ‌గ‌వ్య ఆరాధ‌న‌, రెండో రోజు క్షీరాధివాసం, మూడో రోజు జలాధివాసం, నాలుగో రోజు విమాన గోపుర క‌ల‌శ‌స్థాప‌న‌, విగ్ర‌హ‌స్థాప‌న‌, అష్ట‌బంధ‌నం కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. చివ‌రిరోజైన ఐదో రోజున మ‌హాసంప్రోక్ష‌ణ ద్వారా కుంభాల్లోని స్వామివారి శ‌క్తిని మూల‌మూర్తి(బింబం)లోకి ఆవాహ‌న చేసి ప్రాణ‌ప్ర‌తిష్ట చేస్తారు. అనంత‌రం భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంది. సాయంత్రం 3.30 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు శాంతి క‌ల్యాణోత్స‌వం జ‌రుగ‌నుంది. ఇక్క‌డ స్వామివారు చ‌తుర్బుజాలు, శంఖుచ‌క్రాలు, వ‌ర‌ద, క‌టి హ‌స్తాలు క‌లిగి ఉండి వ‌క్షఃస్థ‌లంలో శ్రీ‌మ‌హాల‌క్ష్మి అమ్మ‌వారితో ద‌ర్శ‌న‌మిస్తారు.

భ‌క్తుల కోసం జ‌ర్మ‌న్ షెడ్లు

జూన్ 9న మ‌హాసంప్రోక్ష‌ణ‌కు విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో ఆల‌యం ఎదురుగా జ‌ర్మ‌న్ షెడ్లు ఏర్పాటు చేశారు. భ‌క్తులకు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. 40 మొబైల్ మ‌రుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. మూడు స్వాగ‌త ఆర్చిలు, న‌గ‌రంలోని ముఖ్య‌మైన 50 ప్రాంతాల్లో మ‌హాసంప్రోక్ష‌ణ‌కు భ‌క్తుల‌కు ఆహ్వానం ప‌లుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆల‌యం నుండి ప్ర‌ధాన రోడ్డుకు అప్రోచ్ రోడ్డు, రెండు లైన్ల బ్యారీకేడ్లు, సాంస్కృతి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ కోసం స్టేజి త‌దితర ఏర్పాట్లు చేశారు. ఆల‌యంలో సేవ‌లందించేందుకు వివిధ విభాగాల నుండి దాదాపు 400 మంది సిబ్బందిని డెప్యుటేష‌న్‌పై నియ‌మించారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు శ్రీ‌వారి సేవ‌కులు, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు భ‌జ‌న బృందాలు క‌లిపి 2 వేల మంది విచ్చేయ‌నున్నారు. రాష్ట్ర‌ గ‌వ‌ర్న‌ర్ గౌ. శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్, ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ. శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి త‌దిత‌ర ప్ర‌ముఖులు విచ్చేయ‌నుండ‌డంతో త‌గిన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు.

ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా శంఖుచ‌క్ర నామాలు

నూత‌న ఆల‌యం వ‌ద్ద విద్యుత్ దీపాలతో ఏర్పాటుచేసిన శంఖుచ‌క్ర నామాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. అదేవిధంగా, ఆల‌య ప్రాకారం, ఆల‌య విమానం, గోపురాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంక‌రించారు. ఆర్‌జిడి లైటింగ్ ఏర్పాటుచేశారు. ఆల‌యం ప్రాంగణంలో వివిధ ర‌కాల పుష్పాల‌తో అలంక‌ర‌ణ‌లు చేప‌ట్టారు. ఇందుకోసం రెండున్న‌ర ట‌న్నుల పుష్పాలు, 20 వేల క‌ట్ ఫ్ల‌వ‌ర్లు వినియోగించారు. ఉద్యాన‌వ‌న విభాగంలో 30 మంది సిబ్బంది సేవ‌లందించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.