KAVACHAMS REMOVED TRADITIONALLY _ శ్రీవారి ఆలయంలో ఉత్స‌వ‌మూర్తుల‌కు శాస్త్రోక్తంగా కవచాల‌ తొలగింపు

TIRUMALA, 07 JUNE 2022: In connection with the annual Jyesthabhishekam, the Swarna Kavacham (golden armor) which is adorned to Sri Malayappa Swamy, His consorts, Sridevi and Bhudevi were removed traditionally at Ranganayakula Mandapam on Tuesday.

Meanwhile, Jyestabhishekam is the special Abhishekam performed to the deities in the month of Jyesta. This is also known as Abhidheyaka Abhishekam. “Abhidheya” in sanskrit means to protect something from being damaged. This annual festival will be observed for three days in Tirumala temple from June 12 to 14. 

EO Sri AV Dharma Reddy, DyEO Sri Ramesh Babu, Peishkar Sri Srihari were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఉత్స‌వ‌మూర్తుల‌కు శాస్త్రోక్తంగా కవచాల‌ తొలగింపు

తిరుమల, 2022 జూన్ 07: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు కవచం తొలగింపు కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రెండో గంట తరువాత రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సంవత్సరం పొడవునా అభిషేకాది క్రతువుల కారణంగా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు కవచాలను తొలగించి శుద్ధి చేస్తారు. సాధార‌ణంగా జ్యేష్ఠాభిషేకానికి ముందు మంగ‌ళ‌వారం క‌వ‌చాల‌ను తొల‌గించి అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేస్తారు.

జూన్ 12 నుంచి 14వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం

జూన్ 12 నుంచి 14వ తేదీ వరకు తిరుమల‌లో అభిద్యేయక జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.

మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.