LORD SWINGS ON GAJA VAHANAM

Tirumala, 5 Oct. 19: On the evening of the sixth day of annual Brahmotsavams of Sri Venkateswara Swamy at Tirumala,  the utsava idol of Sri Malayappa Swamy was taken out in a procession along Four Mada streets Elephant carrier. 

Lord Venkateswara enthralled the devotees by riding on the vehicle covered in gold, one of the most majestic vahanams during the  Brahmotsavams. 

Gaja Vahana signifies the grandeur and mightiness of Lord.

TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

గజవాహనంపై శ్రీ మహావిష్ణువు కటాక్షం

అక్టోబరు 05, తిరుమ‌ల‌, 2019: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శ‌నివారం రాత్రి 8 నుండి 10 గంటల వరకు వేంకటాద్రీశుడు గజ వాహనంపై శ్రీ మహావిష్ణువు అవతారంలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చాడు.

గజ వాహనం – క‌ర్మ విముక్తి

రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి గజవాహనారూఢుడై తిరువీధులలో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ప్రతిరోజూ బ్రహ్మోత్సవాలలో వాహనసేవ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో ఠీవిగా ఈ గజాలు కూడా నడిచివస్తాయి.

కాగా, బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన ఆదివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 8 నుండి 10 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ద‌ర్శ‌న‌మిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ప‌లువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.