BANGARU PATAKAM AND KAUSTUBHAM PRESENTED _ సీతారాములకు శ్రీవారి కానుక

సీతారాములకు  శ్రీవారి కానుక 
 
– సీతమ్మకు బంగారు పతకం 
రామయ్యకు కౌస్తుభం
బహూకరణ 
 
ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 05: ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కల్యాణం సందర్బంగా తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి బుధవారం కానుకలు పంపారు .
 
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో  భాగంగా బుధవారం రాత్రి  కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ  శుభ సందర్బంగా  360 గ్రాముల బరువు గల బంగారు పతకం, కౌస్తుభం ఆభరణాలను కానుకగా అందించారు.
 
టీటీడీ  అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం ఈ ఆభరణాలు సమర్పించారు.  
 
ఆలయం ముందు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఆభరణాలకు పూజలు చేసి కోదండరామునికి అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో  జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీవీరబ్రహ్మం ,ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేశ్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

VONTIMITTA, 05 APRIL 2023:  On the celestial occasion Sri Sita Rama Kalyanam, at Vontimitta on Wednesday, Bangaru Patakam and Kaustubha Abharanam were presented to the deities from Tirumala.

TTD EO Sri AV Dharma Reddy handed over the precious jewels to the deities and performed pujas at Vontimitta Kodandaramalayam.

Later they were decorated to the processional deities during Kalyanam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI