BANGARU TIRUCHI VAHANAM_ ఘ‌నంగా శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirumala, 10 Oct. 18: On the inaugural day of the Navaratri Brahmotsavams, Lord Malayappaswamy along with his consorts was taken on a vahanam procession on the four mada streets in grand and colourful manner this morning.

The presiding deity of Tirumala was glorified and resplendent in fine silks, decorated with flowers and diamond jewels and the devotees sitting in the galleries were enthralled with by the sight of the vahanam on Bangaru Tiruchi. Large number of cultural troupes with their colourful presentation of dances, kola tam, Bhajans and drum beating enthralled the devotees who were spell bound by the divine spectacle of Lord Malayappaswamy in the procession.

Devotional fervour marked the first day celebrations of Navaratri Brahmotsavam at Srivari Temple and the sacred mada streets as bright and colourful flower decorations, Rangolis and festivity welcomed them to become participants in the nine day long jumboorie of vahanams, rituals and parades in the Tirumala shrine.
TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Board Member Sri K Raghavendra Rao, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh and large number of devotees took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఘ‌నంగా శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అక్టోబ‌రు 10, తిరుమల 2018: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఉద‌యం బంగారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ జ‌రిగింది.

బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం ద‌ర్శ‌నం, బ‌స‌, అన్న‌ప్ర‌సాదాలు స‌క్ర‌మంగా అందేలా టిటిడి విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. బ్ర‌హ్మోత్స‌వ శోభ ఉట్టిప‌డేలా విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టింది. వాహ‌న సేవ‌ల ఎదుట సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తోపాటు మాడ వీధుల్లోని ప‌లు వేదిక‌ల‌పై నామ‌సంకీర్త‌న‌, నాద‌నీరాజ‌నం, ఆస్థాన‌మండ‌పం వేదిక‌ల‌పై ఆధ్యాత్మిక‌, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు ఏర్పాటుచేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, పేష్కార్లు శ్రీ రమేష్‌బాబు, శ్రీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.