PROVIDE QUALITY SERVICE TO PILGRIMS DURING BRAHMOTSAVAMS- TIRUMALA JEO_ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సేవలందించాలి -టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
Tirumala, 10 October 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju today exhorted the TTD officials to provide quality and selfless services to lakhs of pilgrims who throng Tirumala during the ongoing Navaratri Brahmotsavams.
Addressing the officials at a review meeting held in control room in front of the Ram Bhagicha Rest House on Wednesday, the JEO urged them to act on a planned manner to provide drinking water, Medicare, security, darshan, accommodation, laddu prasadam besides speedy clearance of garbage for the benefit of devotees.
He asked them to report problematic issues in each sector to senior officials of the for quick redressal. He directed the engineering officials to keep necessary sign boards in view of Garuda Seva.
In charge CVSO Sri SivaKumar Reddy, SE-2 Sri Ramachandra Reddy and other officials participated in the review meeting.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సేవలందించాలి -టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
తిరుమల, 10 అక్టోబర్, 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు రాజీలేకుండా సేవలు అందించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని రాంభగీచా వసతి గృహం ఎదురుగా ఉన్న సమావేశ మందిరంలో బుధవారం ఉదయం జెఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు విచ్చేసే భక్తులకు దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయాలన్నారు. టిటిడి అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాలలో విధులు నిర్వహించి చక్కగా సేవలందించాలని సూచించారు. ఆయా ప్రాంతాలలో సమస్యలు ఎదురైతే ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. వాహనసేవలు, గ్యాలరీలలో చేయవలసిన పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 14వ తేది గరుడసేవ రోజున అన్నప్రసాదం, ఆరోగ్యశాఖలకు అవసరమైన శ్రీవారి సేవకులను ఇప్పటినుంచే అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. టిటిడి అధికారులు ఇతర విభాగాల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని విధులు నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఎస్ఈ -2 శ్రీ రామచంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.