BRAHMANDA NAYAKUNI MAHA RATHOTSAVAM _ భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు
GIANT WOODEN CHARIOT PROCESSION HELD AMIDST SEA OF HUMANITY
CHANTS OF GOVINDA… GOVINDA ECHOES IN TIRUMALA
TIRUMALA, 11 OCTOBER 2024: On the penultimate day of the annual Brahmotsavams at Tirumala, the grand procession of the mammoth wooden chariot was held on Friday amidst a huge participation of devotees.
The giant car marched along the jam-packed four mada streets with pilgrims on the bright Sunny day with the divine chants of Govinda…. Govinda echoing everywhere.
The processional deities of Sri Malayappa Swamy, Sri Devi and Bhudevi mounted on a well-decked platform inside the chariot was dragged by enthusiastic pilgrims with religious pomp and gaiety.
As Tallapaka Annamacharya described in his sankeertan, “the sky and earth became one as the Brahmanda(Mammoth) Ratham marched along the streets and it is a treat to the eyes who witness the grand celestial procession of this Maha Ratham”.
Special rituals:
After the conduct of special rituals such as ‘Punyavachanam’ and ‘Navagraha Dhyanam,’ the processional deities of Sri Malayappa flanked by His two divine consorts were ceremoniously mounted atop the giant wooden chariot.
The chariot was tastefully decorated with different varieties of flowers, flags and festoons. As is customary, the golden umbrella was tied atop the mammoth chariot.
The chariot majestically rolled down the thoroughfares of the hill temple preceded by temple paraphernalia, including half-a-dozen caparisoned elephants, horses, bulls, cultural and bhajan troops besides a contingent of Vedic pundits led by the priests of the temple.
A sea of humanity turned out on the Eighth day as a part of the ongoing Navahnika Salakatla Brahmotsavams to witness “Brahmanda Nayakuni Maha Rathotsavam”.
Both the Pontiffs of Tirumala, TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Sridhar, CE Sri Satyanarayana and other officers were also present
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు
• వేడుకగా రథోత్సవం
• భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు
తిరుమల, 2024 అక్టోబరు 11: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.
తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ”రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే” అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.
రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.