EVERY DAY IS A G-DAY FOR US-TTD EO _ ప్రతి రోజూ గరుడ సేవగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులకు సేవలు అందించాలి•⁠ ⁠అధికారులకు దిశా నిర్దేశం చేసిన టీటీడీ ఈవో

Tirumala, 11 October 2024:  Treat every day as a Garuda Seva and discharge duties with utmost care and commitment said TTD EO Sri J Syamala Rao.

While discussing the preparations for Chakrasnanam scheduled on October 12 with all the Heads at Brahmotsavam Cell in Tirumala on Friday, the EO along with Additional EO Sri Ch Venkaiah Chowdary asked the employees to continue the same spirit even on the last day of the annual fete.

The EO said all the entry and exit points in Pushkarini, dress changing rooms for men, women devotees have been planned this year in a much better way than in the previous years.

He asked the officials concerned to ensure that the devotees have a hassle free holy bath during Chakra Snanam on Saturday and asked the health (sanitation), medical, vigilance departments to be more active.

The EO also instructed the CVSO to coordinate efforts with the police in crowd management as the Pushkarini capacity is very limited.

Later the Additional EO said the Engineering wing has placed information boards and as the risk parameters are high due to restricted space inside the Pushkarini all the deployed staff should be more careful and cautious.

The CVSO Sri Sreedhar said for every 20meter distance one swimmer has been deployed inside Pushkarini along with NDRF and SDRF personnel apart from 40 life jackets.

JEOs Smt Goutami, Sri Veerabrahmam, CE Sri Satyanarayana and other officers were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రతి రోజూ గరుడ సేవగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులకు సేవలు అందించాలి

•⁠ ⁠అధికారులకు దిశా నిర్దేశం చేసిన టీటీడీ ఈవో

తిరుమ‌ల‌, 2024 అక్టోబ‌రు 11: ప్రతి రోజూ గరుడ సేవగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అన్నారు.

తిరుమలలోని బ్రహ్మోత్సవం సెల్‌లో శుక్రవారం ఉదయం అక్టోబరు 12న జరగనున్న చక్రస్నానం ఏర్పాట్లపై ఈవో, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఏర్పాట్లపై చర్చిస్తూ, చివరి రోజు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఉద్యోగులను కోరారు.

పుష్కరిణిలోని అన్ని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లు, పురుషులు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత మెరుగ్గా ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు.

శనివారం చక్రస్నానం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు ఆచరించాలని, ఆరోగ్య (పారిశుద్ధ్యం), వైద్య, విజిలెన్స్ విభాగాలు మరింత చురుగ్గా పనిచేయాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు.

పుష్కరిణి సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నందున క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో పోలీసులతో సమన్వయం చేసుకొని పని చేయాలని సివిఎస్‌ఓను ఈవో ఆదేశించారు.

అనంతరం అదనపు ఈవో మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విభాగం ఇప్పటికే పుష్కరిణి, పరిసర ప్రాంతాలలో సమాచార బోర్డులు ఏర్పాటు చేసిందని, పుష్కరిణి లోపల స్థలం పరిమితంగా ఉండడంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది మరింత జాగ్రత్తగా విధులను నిర్వహించాలని సూచించారు.

పుష్కరిణిలో ప్రతి 20 మీటర్ల దూరానికి ఒక ఈతగాడిని, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు 40 లైఫ్‌ జాకెట్లు ఏర్పాటు చేసినట్లు సివిఎస్‌వో శ్రీ శ్రీధర్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేఈఓలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మం, సిఈ శ్రీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.