BRAVING RAINS PANCHAMI DEVOTEES TURN IN HUGE NUMBERS FOR PANCHAMI THEERTHAM _ వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

THE BIRTHDAY OF GODDESS CELEBRATED WITH GRANDEUR

GODDESS GETS GIFTS FROM LORD VENKATESWARA

Tiruchanoor, 1 Dec. 19: Inclement weather has not hampered the devotional enthusiam of devotees as the pilgrims from Southern states of India, especially from Tamilnadu turned out in huge numbers for Panchami Theertham on Sunday.

 

SEA OF HUMANITY

Every inch of Padma Pushkarini was occupied by devotees who stood in sacred waters of the temple tank for over four hours braving incessant rain,  to take a holy dip in waters.

The annual Karthika Navahnika Brahmotsavams come to grand finale with the most auspicious event of Panchami Theertham which was observed with utmost pomp and gaiety in Padma Sarovaram.

SERIES OF RITUALS

CHOORNABHISHEKAM

Earlier the processional deity of Sri Padmavathi Devi was set ready for Choornabhishekam in Dhwajastambha Mandapam. 

As it was the Birthday of Mother Goddess, She was rendered hair bath by applying Sesame oil and Choornam paste by reciting Sri Mantram and Sri Sooktam. Later she was taken to Panchami Theertha mandapam in a celestial procession. 

TIRUMALA SARE OFFERED

The Goddess was seated on a specially designed platform in Panchami Theertha Mandapam along with Sri Sudarshana Chakrattalwar. Navakalasa Avahana was performed. This was followed by Vishwaksena Aradhana,  Punyahavachanam and other rituals as per Pancharatra Agama Vidhi. 

The gift from Lord Venkateswara on the Birthday of His beloved better half Goddess Padmavathi was also offered during snapanam. 

 

The sare reached Tiruchanoor in a grand procession at around 11.30am from Tirumala which started at 4.30am. Tirumala Additional EO Sri AV Dharma Reddy accompanied the procession which was joined by EO Sri Anil Kumar Singhal,  JEO Sri Basanth Kumar at Tiruchanoor.

LAKSHMI VADDANAM PRESENTED

This year as a present from Lord Venkateswara, diamond studded golden Lakshmi Vaddanam (waist ornament) weighing around 1.3kilos was decked to Goddess Padmavathi Devi as Birthday present during Snapanam.

COLOURFUL SNAPANAM 

During the snapanam, garlands and crowns made of different flowers, fruits and seeds were decked to Goddess. The garlands and crowns included dry grapes, coconut tree leaves, dryfruits, cuscus, flowers, Pavitras and Tulasi seeds.

The garlands made out of Tulasi seeds and Pavitras stood as special attraction. Donors Sri Rajendra,  Sri Shanmuga Sundaram, Sri Subramanyam from Tiruppur of Tamilnadu and Sri Narahari of Nellore contributed for these garlands and crowns.

HOLY DIP

 At the stipulated auspicious hour in the noon,  the Chakrattalwar was given a holy dip by priests. The devotees also took a dip simultaneously chanting Govinda…Govinda.

Board members Smt V Prasanthi Reddy, Sri Siva Kumar, Temple DyEO Sri C Govindarajan and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

తిరుప‌తి, 2019 డిసెంబ‌రు 01: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని పట్టపుదేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరిగింది.

ఉదయం 6.30 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి  ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. పంచమీ తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కిలో 300 గ్రాములు బ‌రువుగ‌ల వ‌జ్రాలు పొదిగిన అష్ట‌ల‌క్ష్మీ స్వ‌ర్ణ వ‌డ్డాణాన్నిసారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.

శోభాయ‌మానంగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం

పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. ఎండు ద్రాక్ష‌, కొబ్బ‌రి పూలు, ఎండుఫ‌లాలు, ప‌విత్రాల‌తో మాల‌లు రూపొందించారు. తులసి గింజ‌లు, ప‌విత్రాల‌తో చేసిన మాల‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. త‌మిళ‌నాడులోని తిరుపూర్‌కు చెందిన శ్రీ రాజేంద్ర‌, శ్రీ ష‌ణ్ముగ సుంద‌రం, శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, నెల్లూరుకు చెందిన శ్రీ న‌ర‌హ‌రి ఈ మాల‌ల త‌యారీకి విరాళం అందించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కుంభ లగ్నంలో పంచమీ తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించారు.

కాగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శ్రీ నారాయ‌ణ‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు, చంద్రగిరి ఎంఎల్‌ఏ డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి,  బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి వి.ప్ర‌శాంతి, శ్రీ శివ‌కుమార్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాధ్ జెట్టి,  తిరుపతి అర్బన్‌ ఎస్పీ శ్రీ గ‌జ‌రావ్ భూపాల్‌, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్ ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

డిసెంబరు 2న పుష్పయాగం

డిసెంబరు 2వ తేదీ సోమ‌వారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేసింది. రూ.500/- టికెట్ కొనుగోలు చేసి గృహస్తులు(ఇద్దరు) పుష్పయాగంలో పాల్గొనవచ్చు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.