CHAIRMAN CONDEMNS THE ALLEGED REPORTS OF YESAIAH IN TTD WEBSITE _ టిటిడి వెబ్‌సైట్‌లో “యేస‌య్య” అనే ప‌దం ఎప్పుడూ లేదు :టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

URGES MEDIA NOT TO PLAY WITH THE SENTIMENTS OF DEVOTEES

CYBER CRIME WING SOON IN TTD 

 IT’S AN ISSUE RELATED TO GOOGLE INTERPRETER-EO

Tirupati, 1 Dec. 19: Strongly condemning the alleged reports by a vernacular newspaper which essayed “Yesaiah” word in TTD calendar search in website as it Headlines, TTD Chairman Sri YV Subba Reddy termed it as a “conspired article with vested interest and completely baseless”.

 

“To counter such baseless reports which are going viral in social media,  we have decided to open up a Cyber Crime Wing TTD soon”,  the Chairman maintained.

Convening a press conference at SPRH in Tirupati on Sunday evening along with TTD top brass officials, Chairman brushed away the reports stating them as “Intentionally done by some vested interests to tarnish the image of CM of AP Sri Jagan Mohan Reddy. “Since you have no issues to point out at the state government which is giving a good governance, you have taken up the baseless evangelism issue. But my humble request to the media is not to play games with Lord Venkateswara and sentiments of crores of Hindus across the globe. In the name of vengeance you are tarnishing the image of TTD and Lord which is unpardonable. We will definitely take up legally on those who involve in baseless allegations against TTD”,  he asserted.

Later explaining the Google Interpreter error,  EO Sri Anil Kumar Singhal said,  there is no word “ Yesaiah ” in TTD website.  In the google search yesterday, the TTD Vikarinama Samvatsara Panchangam 2019-20  displayed a word Sriye as Sri Yesaiah. The transliteration of google depends on pdf image, font size, font type and space between them letters. It is an issue of google inscripter  but not with the TTD Panchangam.

He said TTD has already sought a clarification from Google on the issue and it took 12 hrs to update on the google cache. The word is not appearing on the google page now and is missing.

Our IT team and Vigilance team enquired on the whole episode and TTD website is not hacked from out side or any deiiberate sabotage by an insider. It has been identified as an Google Interpreter issue only”,  he reiterated. 

JEO Sri P Basanth Kumar,  CVSO Sri Gopinath Jatti, Additional CVSO Sri Sivakumar Reddy,  IT Chief Sri Sesha Reddy were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

టిటిడి వెబ్‌సైట్‌లో “యేస‌య్య” అనే ప‌దం ఎప్పుడూ లేదు :టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుప‌తి, 2019 డిసెంబ‌రు 01: టిటిడి వెబ్‌సైట్‌లో “యేస‌య్య” అనే ప‌దం ఎప్పుడూ లేదని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో ఆదివారం సాయంత్రం  టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌తో క‌లిసి ఛైర్మ‌న్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

 ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ టిటిడిలో అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని ఒక ప‌త్రిక దురుద్దేశ‌పూర్వ‌కంగా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా క‌థ‌నం ప్ర‌చురించింద‌న్నారు. ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోలేని కొన్ని దుష్ట‌శ‌క్తులు అన్య‌మ‌త ప్ర‌చారం పేరుతో గంద‌ర‌గోళం సృష్టిస్తున్నాయ‌ని చెప్పారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి జోలికి వ‌స్తున్న ఇలాంటి వారు త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌న్నారు.  టిటిడిపై దుష్ప్ర‌చారం చేసేవారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఆన్‌లైన్ వేదిక‌గా టిటిడిపై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారాన్ని అడ్డుకునేందుకు ప్ర‌త్యేకంగా సైబ‌ర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటుచేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరుతామ‌న్నారు.

గూగుల్ సెర్చింజ‌న్‌లో “టిటిడి వికారినామ సంవ‌త్స‌ర పంచాంగం 2019-20” అని టైప్ చేస్తే అందులో “శ్రీ యేస‌య్య” అనే ప‌దం ఆ డిస్‌ప్లేలో శ‌నివారం క‌నిపించింద‌న్నారు. టిటిడి పంచాంగం మొద‌టి పేజీలో తెలుగులో “శ్రియై న‌మః” అనే ప‌దం క‌నిపిస్తుంద‌ని, దీన్ని గూగుల్ ఇంట‌ర్‌ప్రిట‌ర్‌లో తీసుకున్న‌పుడు హెచ్‌టిఎంఎల్ క్యాషెలో “శ్రీ యేస‌య్య‌”గా మార్పు చెంది ఉండ‌వ‌చ్చ‌న్నారు. గూగుల్ ఇంట‌ర్‌ప్రిట‌ర్‌లో త‌ర్జుమా అయ్యే ప‌దాలు పిడిఎఫ్ ఇమేజ్, బార్డ‌ర్ ప‌రిమాణం, ఫాంట్ సైజు, ఫాంట్ టైపు, అక్ష‌రాల మ‌ధ్య స్పేస్ త‌దిత‌ర అంశాలపై ఆధార‌ప‌డి ఉంటాయ‌ని చెప్పారు. ఇది గూగుల్ ఇంట‌ర్‌ప్రిట‌ర్ స‌మ‌స్యే గానీ, టిటిడి పంచాంగంలో దొర్లిన త‌ప్పు కాద‌ని తెలియ‌జేశారు.

ఈ స‌మ‌స్యను అధిగ‌మించ‌డానికి గాను ఈ విష‌యాన్ని శ‌నివారం గూగుల్‌కు రిపోర్టు చేసి వివ‌ర‌ణ కోరామ‌ని, అ త‌రువాత గూగుల్ క్యాషెలో అప్‌డేట్ అవ‌డానికి 12 గంట‌లు ప‌ట్టింద‌ని, ఆ త‌రువాత ఆ ప‌దం క‌నిపించ‌లేద‌ని  ఛైర్మ‌న్ తెలిపారు. టిటిడి వెబ్‌సైట్‌ను బ‌య‌ట నుండి ఎవ‌రూ హ్యాక్ చేయ‌డం గానీ, టిటిడి ఇన్‌హౌస్‌లో ఉద్దేశ‌పూర్వ‌కంగా దుర్వినియోగం అయిన‌ట్టుగానీ ఐటి టెక్నిక‌ల్ టీమ్ విచార‌ణ‌లో తెలియ‌లేదన్నారు. ఇది కేవ‌లం గూగుల్ ఇంట‌ర్‌ప్రిట‌ర్ స‌మ‌స్య‌గానే గుర్తించామ‌ని తెలిపారు.

ఈ మీడియా స‌మావేశంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.