ANKURARPANAM FOR PUNGANUR TEMPLE BTU ON MARCH 6 _ మార్చి 6న శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మార్చి 6న శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ – బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి తిరుపతి, 2025 మార్చి 05: చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో మార్చి 7 నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు మార్చి 6వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, ఆలయం, మాడ వీధుల్లో […]