VAIKUNTHA DWADASI CHAKRASNANAM HELD IN SWAMY PUSHKARINI _ శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

SUDARSHANA CHAKRATTALWAR IMMERSED IN HOLY WATERS OF TEMPLE TANK AFTER NINE MONTHS

Tirumala, 26 Dec. 20: On the auspicious occasion of Vaikuntha Dwadasi, Chakrasnanam was performed in Ekantam to Sri Sudarshana Chakrattalwar in the sacred waters of Swamy Pushkarini in Tirumala on Saturday.

This is for the first time, the Sudarshana Chakrattalwar was being rendered holy Chakrasnanam in the temple tank waters after nine months. It may be mentioned here that, TTD has closed the Pushkarini activities early in March this year, following Covid pandemic along with the entry of pilgrims in to Pushkarini. Even during the annual and Navarathri brahmotsavams also, TTD has observed Chakrasnanam in a makeshift temple tank inside the temple only. 

Speaking on this occasion, TTD Chairman Sri YV Subba Reddy said, this celestial fete is usually performed four times in a year, during brahmotsavams, Radhasapthami, Ananta Padmanabha Vratam and Vaikuntha Dwadasi. “Almost after nine months we have performed Chakrasnanam in Pushkarini, but in Ekantam”, he observed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

తిరుమల, 2020 డిసెంబ‌రు 26: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ‌నివారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుద‌ర్శ‌న చ‌క్ర‌త్తాళ్వార్‌ను శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ భూవ‌రాహ‌స్వామివారి ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు. కోవిడ్‌-19 కార‌ణంగా దాదాపు 9 నెల‌ల త‌రువాత పుష్క‌రిణిలో చ‌క్ర‌స్నానం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు, ర‌థ‌స‌ప్త‌మి, అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం, వైకుంఠ ద్వాద‌శి సంద‌ర్భంగా సంవ‌త్స‌రంలో నాలుగుసార్లు చ‌క్ర‌స్నానం జ‌రుగుతుంద‌ని తెలిపారు. కోవిడ్ త‌రువాత ప్ర‌స్తుతం ఏకాంతంగా చ‌క్ర‌స్నానం నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు.

శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నాన‌మాచ‌రించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం. ద్వాద‌శి ప‌ర్వ‌దినం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవ‌లను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.