CHINNA SESHA VAHANA SEVA HELD _ చిన్నశేషవాహనంపై శ్రీ మలయప్ప చిద్విలాసం

Tirumala, 04 February 2025: As a part of the Saptha Vahana fete, Sr Malayappa took out a celestial ride on the five hooded Chinna Sesha Vahanam on Tuesday.

The Chinna Sesha Vahanam was observed between 9am and 10am.

EO Sri J Syamala Rao, other officers and a few board members, a large number of devotees were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చిన్నశేషవాహనంపై శ్రీ మలయప్ప చిద్విలాసం

తిరుమల, 2025 ఫిబ్రవరి 04: తిరుమలలో మంగళవారంనాడు రథసప్తమి ఉత్సవం సందర్భంగా రెండో వాహనమైన చిన్నశేష వాహనసేవ ఘనంగా జరిగింది.

చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు (ఉదయం 9 గం||ల నుండి 10 గం||ల వరకు) :

సూర్యప్రభ వాహనంపై శ్రీసూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు.

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ జె శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, పాలకమండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ జి.భానుప్రకాష్ రెడ్డి, ఇంఛార్జి సివిఎస్వో శ్రీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.