GARUDA VAHANA GOVINDA… _ గరుడవాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం
గరుడవాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం
తిరుమల, 2025 ఫిబ్రవరి 04: తిరుమలలో మంగళవారంనాడు రథసప్తమి ఉత్సవం సందర్భంగా మూడో వాహనమైన గరుడ వాహనసేవ వేడుకగా జరిగింది.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం (ఉదయం 11 నుండి 12 గం||ల వరకు) :
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ జె శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, పాలకమండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ జి.భానుప్రకాష్ రెడ్డి, ఇంఛార్జి సివిఎస్వో శ్రీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.