CM OFFERS VASTRAMS TO LORD ON BEHALF OF STATE GOVERNMENT _ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

TAKES PART IN GARUDA SEVA

Tirumala, 23 Sep. 20: The Honourable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy offered a pair of ‘silk vastrams’ to Lord Sri Venkateswara Swamy on behalf of the State Government in connection with the annual brahmotsavams on the auspicious occasion of Garuda Seva on Wednesday evening.

After a brief ceremony at Sri Bedi Anjaneya Swamy temple, the Chief Minister carried the sacred ‘vastrams’ in a silver plate over his head and proceeded towards the main temple complex amidst the chanting of Veda Mantras by priests to the melodious accompaniment of Melam and Nadaswaram. Later, he handed over the vastrams to the chief priest inside the temple and had darshan of Lord Venkateswara. 

These ‘vastrams’ were adorned to the deity during Garuda Seva. After offering prayers in the temple of Lord Venkateswara, the CM participated in Garuda Seva, the most important event, which occurs on the fifth day evening during the nine day brahmotsavams.

DyCM Sri Narayanaswamy, Ministers Sri P Ramachandra Reddy, Sri A Nani, Smt Suchitra, Sri Gowtham Reddy, Sri Kodali Nani, Sri Venugopala Krishna,  Sri TTD EO Sri Anil Kumar Singhal, Board members Sri Karunakara Reddy, Sri Ananta, Sri Siva Kumar, Sri Govindhari, Sri DP Anantha, Sri Sekhar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Srivari temple DyEO Sri Harindranath were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

సెప్టెంబర్ 23, తిరుమ‌ల 2020: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్రాలు సమర్పించారు.

ముందుగా గౌ|| ముఖ్యమంత్రివర్యులు శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు  పరివట్టం కట్టారు. అక్కడినుంచి పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని  మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆల‌యానికి చేరుకుని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ కలిసి స్వాగతం పలికారు.

దర్శనానంతరం గౌ|| ముఖ్యమంత్రివర్యులను రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం గరుడ సేవలో గౌ|| ముఖ్యమంత్రివర్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రులు శ్రీ నారాయ‌ణ‌స్వామి, శ్రీ ఆళ్ల నాని, రాష్ట్ర మంత్రులు శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రా‌రెడ్డి, శ్రీ‌మ‌తి మేక‌తోటి సుచరిత‌, శ్రీ గౌతంరెడ్డి, శ్రీ వేణుగోపాలకృష్ణ, శ్రీ కొడాలి నాని, చీఫ్‌ విప్ శ్రీ‌కాంత్‌రెడ్డి, ఎపిఐఐసి ఛైర్మ‌న్ శ్రీ‌మ‌తి ఆర్‌కె.రోజా, ఎంపిలు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, శ్రీ మిథున్‌రెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే శ్రీ క‌రుణాక‌ర్‌రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అర్బ‌న్ ఎస్పీ శ్రీ ఎ.ర‌మేష్‌రెడ్డి ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ప్ర‌త్యేక ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.