GARUDA GAMANA GRACES ON GARUDA VAHANA _ గరుడ వాహనంపై శ్రీ మలయప్ప సాక్షాత్కారం…. గరుడవాహనసేవలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
Namah Pannaganaddhaaya Vaikunta Vasavardhineh
Sruti-sindhu Sudhothpaada-Mandaraaya Garutmathe
-These are the first two lines from Garuda Shloka which narrates “My salutations to Garuda with the beautiful wings. His limbs adorned by the mighty serpents that he has conquered in battle, which were his jewellery. He does all the intimate kainkaryas to his Master, Lord Sri Maha Vishnu and is His favourite servant. He is adept like the Mandara Mountain”.
Tirumala, 23 Sep. 20: On the fifth day evening, the most important of all vahana sevas during the nine day annual brahmotsavams, the Garuda Vahana Seva took place in Kalyanotsava Mandapam in Ekantam in view of COVID 19 restrictions.
Garuda’s strong position in Hinduism can be estimated by the fact that two ancient Hindu texts, the Garudopanishad and the Garuda Purana, both dedicated to the mighty King of Aves.
The Vedas refer him as Syena, where this mighty Eagle is adored as the one who brought nectar from heaven to earth. Garuda is the Sankarshana energy of the Lord, who is believed to take the manifestation of the omniscient nature of the Lord, during the process of creation. He represents the five vayus that lie within each of us, namely, Prana, Vyana, Udana, Samana and Brahmana and Garuda represent each of these five forms as Satya, Suparna, Garuda, Tarkshya, Vihageshwara respectively. The flapping wings of Garuda are believed to have formed the basis of the Sama Veda.
Lord Sri Malayappa Swamy in His divine splendor seated majestically on His most favourite carrier Garuda Vahana, charmed the devotees who witnessed the fete live through Sri Venkateswara Bhakti Channel, sitting right at their home turfs and enjoyed the vahana seva.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
గరుడ వాహనంపై శ్రీ మలయప్ప సాక్షాత్కారం
గరుడవాహనసేవలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
తిరుమల, 2020 సెప్టెంబరు 23: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై దర్శనమిచ్చాడు. వాహన సేవలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
కాగా, బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన గురువారం ఉదయం 9 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 7 గంటలకు గజవాహనంపై శ్రీవారు కటాక్షించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.