DARSHAN TRIAL RUNS FOR PILGRIM CROWD MANAGEMENT ASSESSMENT: TTD CHAIRMAN SRI YV SUBBA REDDY _ అవగాహన కోసమే ట్రయల్ రన్ అవకాశాన్ని బట్టి టికెట్ల సంఖ్య పెంచుతాం : టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

PLAN MORE TICKETS AS PER OPPORTUNITY

Tirumala, 8 Jun. 20: The trial run of Srivari Darshan for employees on June 8 and 9 and Tirumala locals on June 10, is mulled to assess how many devotees could be accommodated in the queues as per rigid Covid-19 guidelines of the state and central governments, said TTD Trust Board Chairman Sri Y V Subba Reddy.


 The Chairman physically supervised the trial run of darshan allotted for TTD employees and their families at the Srivari temple on Monday morning and made some suggestions to, officials on observing social distancing in Queue lines, visiting Hundi to make offerings and using non-alcoholic sanitizers.

Speaking to reporters outside the temple, the TTD chairman said though it was planned for 500 devotees for darshan per hour, nearly 1200 devotees had darshan in the first two hours observing all guidelines of social distancing etc. “After careful observing the movement for three days, TTD will take a call on the need to increase the issue of a number of tickets in future”, he added.

He said the devotees are advised to not touch the temple walls or the grills and special arrangements made to ensure that they do not touch even the water taps. TTD has placed Foot Operated taps inside the temple. “TTD will resume prasadam only after approval from the government”, he maintained. 

He said instructions have been issued that laddu counters will operate for every two hours alternatively and they too will be sanitized every two hours along with temple and queue complex. TTD staff working in close distance with devotees have been given special PPE kits.  

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అవగాహన కోసమే ట్రయల్ రన్ 
అవకాశాన్ని బట్టి టికెట్ల సంఖ్య  పెంచుతాం  :  టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

 జూన్ 08, తిరుమల  2020: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అమలుపరుస్తూ గంటకు ఎంత మంది భక్తులకు    తిరుమల శ్రీవారి దర్శనం చేయించవచ్చో క్షేత్ర స్థాయిలో  అవగాహకు రావడానికే ట్రయల్ రన్ ప్రారంభించామని టిటిడి పాలకమండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో ఉద్యోగులతో నిర్వహించిన ట్రయల్ రన్ ను ఆయన దగ్గరుండి పరిశీలించారు. క్యూలో భౌతిక దూరం అమలవుతున్న విధానాన్ని చూసి అధికారులకు  పలు సూచనలు చేశారు. కానుకలు సమర్పించేందుకు భక్తులు హుండి వద్దకు వెళ్ళేప్పుడు, బయటకు వచ్చేప్పుడు నాన్ ఆల్కాహాల్ సానిటైజర్ తో చేతులు శుభ్రం చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.

అనంతరం ఆలయం వెలుపల చైర్మన్ తనను కలసిన మీడియాతో మాట్లాడారు. గంటకు 500 మందికి దర్శనం చేయించవచ్చని అధికారులు అంచనా వేశారని చెప్పారు. అయితే దర్శనం ప్రారంభించిన 2 గంటల్లో 1200 మంది భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. మూడు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించి అవకాశాన్ని బట్టి రోజువారీ దర్శనాల సంఖ్య పెంచుతామని ఆయన తెలిపారు. క్యూలైన్ లో భక్తులు గ్రిల్స్, గోడలు తాకకుండా వారికి అవగాహన కల్పిస్తామని, ఆలయం ప్రాంగణంలోని తాగునీటి కుళాయిలను కూడా చేత్తో తాకకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. దర్శనం చేసుకున్న భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడానికి రాష్ట ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశామని అనుమతి వస్తూనే ప్రసాదాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. భక్తులకు అతిదగ్గరగా విధులు నిర్వహించే సిబ్బందికి పీపీఈ కిట్లు అందించామన్నారు. లడ్డు కౌంటర్లలో  2 గంటలు సగం కౌంటర్లు, ఆ తర్వాత సగం కౌంటర్లు పనిచేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయం, క్యూ కాంప్లెక్స్ తో పాటు లడ్డూ కౌంటర్ల ను కూడా ప్రతి 2 గంటలకు సానిటైజ్ చేయించాలని ఆదేశాలు జారీ చేసినట్లు శ్రీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయతో త్వరగా కరోనా తొలగిపోయి ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యాంగా ఉండాలని ఆయన కోరారు. అలిపిరి వద్ద భక్తులను స్క్రీనింగ్ చేసి, సానిటైజ్ చేశాకే తిరుమలకు అనుమతిస్తున్నామని చైర్మన్ వివరించారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.