DARSHAN BEGINS IN TTD LOCAL TEMPLES- TTD EO SINGHAL _ టిటిడి స్థానికాల‌యాల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

EO AND JEO INSPECT ARRANGEMENTS

Tirupati, 8 Jun. 20: Devotees expressed their profound satisfaction on darshan of Sri Padmavati Ammavaru at Tiruchnoor as the darshan is reopened after a gap of over two and a half months, said TTD EO Sri Anil Kumar Singhal.

TTD EO along with Tirupati JEO Sri P Basant Kumar inspected the arrangements at Sri Padmavati Ammavari Temple and Sri Govindarajaswami temple on Monday.

Speaking to media at Tiruchanoor, the EO said that TTD had closed darshan at Srivari temple on March 20 itself though corona lockdown came into force from March 25 onwards.

Denying the false reports in social media that Srivari temple was closed and no kainkaryams were performed, he said that only darshan for devotees was suspended but all daily kaikaryas continued non-stop till date.

He said in the backdrop of relaxation of lockdown from June 8, the government had approved the commencement of Srivari Darshanam in Tirumala. The TTD Chairman Sri YV Subba Reddy and senior officials after extensive deliberations framed guidelines for Srivari darshan as per government restrictions in addition to suggestions by devotees through emails etc.

He said in an experimental way on Monday and Tuesday, TTD employees and their families are allotted darshan following norms of with social distancing of two meters distance and darshan is planned for 6000 devotees in 12 hours at the rate of 500 per hour.

The TTD EO said special care is taken to organise social distancing at all TTD local temples including Tiruchanoor, Srinivasa Mangapuram, Appalayagunta, Kapilatheertham and Sri Govinda Raja Swamy temple which opened up for darshan on Monday with stringent COVID guidelines. 

EO said Tickets could be procured either online, through SMS or the counters set at the temple premises. As per government guidelines, 250 devotees are being allowed for darshan per hour.

At all temples, no Thirtham and Shatari will be given. As per government guidelines all devotees are should wear masks and sanitizers and all queue lines are sanitized every two hours, he added.

He also checked the sanitizers placed at different points in Sri Govinda Raja Swamy temple. TTD Additional CVSO Sri Siva Kumar Reddy, Special Grade Dyeo Smt Varalakshmi were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి స్థానికాల‌యాల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

ప‌లు ఆల‌యాల్లో ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో, జెఈవో

తిరుపతి, 2020 జూన్ 08: కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు టిటిడి స్థానికాల‌యాల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంద‌ని, దాదాపు 79 రోజుల త‌రువాత స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకోవ‌డంతో భ‌క్తులు సంతోషం వ్య‌క్తం  చేశార‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌తో క‌లిసి ఈవో సోమ‌వారం తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యాన్ని, తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యాన్ని ప‌రిశీలించారు. క్యూలైన్ల‌లో చేసిన ఏర్పాట్లను ప‌రిశీలించి భ‌క్తులు భౌతిక దూరం పాటించేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

తిరుచానూరులో అమ్మ‌వారి ద‌ర్శ‌నానంత‌రం ఈవో మీడియాతో మాట్లాడుతూ క‌రోనా వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు మార్చి 25 నుండి ఆల‌యాల‌కు భ‌క్తులను అనుమ‌తించ‌రాద‌ని కేంద్ర, రాష్ట ప్ర‌భుత్వాలు ఆదేశాలు జారీ చేశాయ‌ని, అయితే ముందుజాగ్ర‌త్త‌గా మార్చి 20వ తేదీ నుండి తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం నిలుపుద‌ల చేశామ‌ని తెలిపారు. టిటిడి ఆల‌యాల‌న్నీ మూసివేశార‌ని ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో దుష్ప్ర‌చారం జ‌రిగింద‌ని, దీనిపై ఆల‌యాల‌ను మూసివేయ‌లేద‌ని, భ‌క్తుల ద‌ర్శ‌నాన్ని మాత్ర‌మే నిలుపుద‌ల చేశామ‌ని, కైంక‌ర్యాల‌న్నీ య‌థావిథిగా నిర్వ‌హించామ‌ని వివ‌ర‌ణ ఇచ్చామని వివ‌రించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో జూన్ 8 నుండి ఆల‌యాల్లో భ‌క్తుల‌కు దర్శ‌నం క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింద‌న్నారు. టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఇత‌ర సీనియ‌ర్ అధికారుల‌తో క‌లిసి విస్తృతంగా చ‌ర్చించామ‌ని, ప్ర‌భుత్వ‌ మార్గ‌ద‌ర్శ‌కాలను పాటిస్తూ భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు నిబంధ‌న‌లు రూపొందించామ‌ని తెలిపారు. వీటిపై భ‌క్తులు కూడా ఇ-మెయిల్ ద్వారా సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నార‌ని చెప్పారు.

అలిపిరి, తిరుమ‌ల‌లో త‌నిఖీలు నిర్వ‌హించామ‌ని, అలిపిరిలో విజిలెన్స్‌, వైద్య సిబ్బంది భ‌క్తుల ద‌ర్శ‌న టికెట్ల‌ను త‌నిఖీ చేయ‌డంతోపాటు థ‌ర్మ‌ల్ స్కానింగ్ చేస్తున్నార‌ని, మాస్కులు ధ‌రించాల‌ని సూచిస్తున్నార‌ని, వాహ‌నాల‌ను శానిటైజ్ చేసి తిరుమ‌ల‌కు పంపుతున్నార‌ని ఈవో తెలిపారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా టిటిడి ఉద్యోగుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నామ‌ని, భౌతిక‌దూరం పాటించి ద‌ర్శ‌నం చేసుకుంటున్నార‌ని చెప్పారు. గంట‌కు 500 మంది చొప్పున ఒక రోజుకు 12 గంట‌ల్లో 6 వేల మందికి స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టామ‌న్నారు. తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే భ‌క్తుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న టికెట్ల‌తోపాటు గ‌దులు బుక్ చేసుకునే అవ‌కాశం కూడా క‌ల్పించామ‌ని ఈవో తెలిపారు. తిరుప‌తిలోని గ‌దులను కూడా ఆన్‌లైన్‌లో భ‌క్తులకు అందుబాటులో ఉంచామ‌న్నారు. భ‌క్తులు గ‌దులు ఖాళీ చేసిన త‌రువాత 12 గంట‌ల పాటు మ‌రొక‌రికి కేటాయించ‌కుండా పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామ‌ని వివ‌రించారు. తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల్లో రోజుకు 200 మందికి, మ‌రో 200 మంది టిటిడి ఉద్యోగుల‌కు ర్యాండ‌మ్‌గా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింద‌న్నారు. ఈ ప‌రీక్షా ఫ‌లితాలు త్వ‌ర‌గా వ‌చ్చేందుకు తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి కోవిడ్ ఆసుప‌త్రిలో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేప‌ట్టార‌ని వివ‌రించారు.

తిరుప‌తిలోని టిటిడి స్థానికాల‌యాలైన తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యం, శ్రీ కోదండ‌రామాల‌యం, శ్రీ‌నివాసమంగాపురం, అప్ప‌లాయ‌గుంట ఆల‌యాల్లో భ‌క్తులు భౌతిక దూరం పాటించి ద‌ర్శ‌నం చేసుకునేలా ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. ఇక్క‌డ విజిలెన్స్‌, అరోగ్య‌, ఆల‌య సిబ్బంది మాస్కులు ధ‌రించి ఇత‌ర జాగ్ర‌త్త‌లు పాటిస్తూ విధులు నిర్వ‌హిస్తున్నార‌ని వివ‌రించారు. ఈ ఆల‌యాల‌కు సంబంధించి ఎస్ఎంఎస్ ద్వారా గానీ, ఆన్‌లైన్ ద్వారాగానీ, ఆల‌యం వ‌ద్ద‌గ‌ల కౌంట‌ర్‌లో గానీ ద‌ర్శ‌న టికెట్లు పొంద‌వ‌చ్చ‌న్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ ఆల‌యాల్లో ఒక గంట‌కు దాదాపు 250 మంది భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. సోమ‌వారం నాడు ఉద‌యం 7-8 గంట‌ల‌ స్లాట్‌లో 277, 8-9 గంట‌ల‌ స్లాట్‌లో 127, 9-10 గంట‌ల‌ స్లాట్‌లో 269 మంది భ‌క్తులు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నార‌ని తెలిపారు. ఆల‌యాల్లో తీర్థం, శ‌ఠారి, అన్న‌ప్ర‌సాదాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిషేధించింద‌న్నారు. భ‌క్తులంద‌రూ మాస్కులు ధ‌రించి వ‌చ్చార‌ని, శానిటైజ‌ర్ల‌ను వినియోగిస్తున్నార‌ని, క్యూలైన్ల‌ను ప్ర‌తి 2 గంట‌ల‌కోసారి శానిటైజ్ చేస్తున్నామ‌ని వివ‌రించారు.

 ఈ తనిఖీల్లో టిటిడి అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవోలు శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, ఎవిఎస్వో శ్రీ చిరంజీవి, యూనిట్ అధికారి శ్రీ అమ‌ర‌నాథ‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.