DEEPAVALI ASTHANAM PERFORMED _ తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

EO AND PRADHANA ARCHAKAS  EXTENDS WISHES

TIRUMALA, 24 OCTOBER 2022: Deepavali Asthanam was performed with religious fervour in Tirumala temple on Monday in connection with Deepavali festival.

After the traditional temple court to the processional deities of Sri Malayappa, Sridevi, Bhudevi and Viswaksenulavaru in Bangaru Vakili, special Harati was rendered and prasadam were distributed.

Both the Senior and Junior Pontiffs of Tirumala, TTD EO Sri AV Dharma Reddy, MP Sri Prabhakar Reddy, Trust Board member Sri Maruti Prasad, New Delhi LAC Smt Prasanti Reddy, DLO Sri Reddeppa Reddy, DyEO Temple Sri Ramesh Babu, Peishkar Sri Srihari, VGO Sri Bali Reddy were also present.

Speaking to the media later TTD EO Sri Dharma Reddy, Pradhana Archakas Sri Venugopala Deekshitulu, Sri Krishna Seshachala Deekshitulu, wished all the devotees on the auspicious occasion of festival of lights.

Mukhya Archaka Sri Kiran Deekshitulu was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

అక్టోబ‌రు 24, తిరుమల 2022: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా  ‘దీపావళి ఆస్థానాన్ని’ శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు.

శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు అలంకరించినట్టు తెలిపారు.

శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు మాట్లాడుతూ బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించిట్లు వివ‌రించారు.  

       అంత‌కుముందు ఆల‌యంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మ‌వార్లు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

ఈ ఆస్థానంలో  శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్ స్వామి, ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ మారుతి ప్రసాద్, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డిఎల్వో శ్రీ రెడ్డెప్పరెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు, పేష్కార్ శ్రీ శ్రీహరి, విజివో శ్రీ బాలిరెడ్డి, ముఖ్య అర్చకులు శ్రీ కిరణ్ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.