DEEPAVALI ASTHANAM IN LOCAL TEMPLES _ తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం
Tirupati, 24 October 2022: Deepavali Asthanam was observed with religious fervour in TTD local temples on Monday evening on the auspicious occasion of festival of Deepavali.
In Sri Kodanda Rama Swamy temple in Tirupati and at Srinivasa Mangapuram the Asthanam was observed with celestial grandeur by Archakas of the respective temples.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం
తిరుపతి, 2022, అక్టోబరు 24: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం దీపావళి సందర్భంగా రాత్రి 7 గంటలకు దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహించారు.
దీపావళి సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.